అధిక కొవ్వు వాస్కులర్ వ్యాధికి దారితీస్తుంది. కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ కొరోనరీ ఆర్టరీస్ మరియు కరోటిడ్ ఆర్టరీస్ వంటి శరీరంలోని కొన్ని రక్తనాళాలలో తక్షణమే లభిస్తుంది. ధమనులలో అధిక కొవ్వు పేరుకుపోతుంది, ఈ ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. అయితే పచ్చి కొబ్బరిలోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.
రక్తసరఫరా సరిగ్గా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటే వారి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పచ్చికొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.