1. మసాజ్ : రెగ్యులర్ హెయిర్ మసాజ్ మీ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. నూనెలతో మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్‌ను ప్రేరేపిస్తుంది, జుట్టు సాంద్రతను మెరుగుపరుస్తుంది. జుట్టు మూలాలను ఆరోగ్యంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మురికి, ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ స్కాల్ప్ మీద పేరుకుపోయి జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, తలకు నూనె లేదా షాంపూ రాసేటప్పుడు, మసాజ్ చేయండి.
5. గుడ్డులోని తెల్లసొన , నిమ్మరసం ఉపయోగించండి: ప్రతి రెండు వారాలకు ఒకసారి, రెండు గుడ్డులోని తెల్లసొనను కొద్దిగా నిమ్మరసంతో మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి లేదా గోరువెచ్చని ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క, తేనె మిశ్రమాన్ని మీ జుట్టుకు 10 నిమిషాల పాటు అప్లై చేయవచ్చు. ఇవి హెయిర్ మాస్క్‌లా బాగా పనిచేస్తాయి. అప్పుడు మీ జుట్టును నీటితో శుభ్రం చేసుకోండి.
6. ఆహారంలో ఒమేగా 3 పోషకాలను చేర్చండి : మీ జుట్టుకు ఉత్తమమైన సప్లిమెంట్లలో ఒమేగా ఒకటి. ఇది జుట్టు రాలడాన్ని సరిదిద్దడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అయితే, ఏదైనా సప్లిమెంట్ తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బయోటిన్ (విటమిన్ B1) జింక్ వంటి కొన్ని కీలక పోషకాలు మీ జుట్టు పెరుగుదలకు కారణమైన కణాలను ప్రేరేపిస్తాయి.
8. ఆహారంలో ప్రోటీన్ చేర్చండి : ఆరోగ్యకరమైన జుట్టు కోసం తగినంత ప్రోటీన్ తినడం ముఖ్యం. ప్రొటీన్ లోపం ఉన్న ఆహారం జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఆదర్శవంతంగా, వారి శరీర బరువు ఆధారంగా రోజుకు 50 నుండి 100 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)