Christmas Holiday : క్రిస్మస్ సెలవుల్ని గడపడానికి ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Christmas Holiday : క్రిస్మస్ సెలవుల్ని గడపడానికి ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Christmas Holiday : క్రిస్మస్ వచ్చేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పండుగకు పిల్లలకు సెలవు కూడా ఉంటుంది. కాబట్టి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. క్రిస్మస్ను అందంగా జరుపుకునేందుకు కొన్ని ప్రదేశాలకు వెళ్లవచ్చు. ఈ క్రిస్మస్ సెలవుల్ని ఆస్వాదించడానికి సరైన ప్రదేశాల జాబితా చూద్దాం.
Goa : బీచ్‌లకు ప్రసిద్ధి చెందిన గోవాలో క్రిస్మస్ను ఆస్వాదించడం ఒక అందమైన అనుభూతి. ఇక్కడ క్రిస్మస్ పార్టీలు భారీగా జరుగుతాయి. కాబట్టి ఈ టూర్ మీకు బాగా నచ్చుతుంది.
2/ 9
Kerala : సందర్భంగా వీధులను లైట్లతో అలంకరిస్తారు. అలాగే ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా అనేక ఆఫర్లు ఇస్తాయి. కేరళలో చర్చిలు కూడా ఎక్కువే. ఇది మీరు మర్చిపోలేని ట్రిప్ అవుతుంది.
3/ 9
Pondicherry : గోవాలాగే పాండిచ్చేరి కూడా బీచ్‌లకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుకలు అందరి జ్ఞాపకాల్లో నిలిచిపోతాయనడంలో సందేహం అక్కర్లేదు. ఈ సమయంలో ప్రత్యేక పార్టీలు, కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
4/ 9
Diu and Daman : దీవులతో కూడిన డయ్యు, డామన్ కేంద్రపాలిత ప్రాంతంలో క్రిస్మస్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, పోర్చుగీస్ నృత్యాలు మొదలైనవి మీరు ఇక్కడ చూడవచ్చు. బీచ్ పార్టీలు జోరుగా సాగుతాయి.
5/ 9
Shillong : రాజధాని షిల్లాంగ్‌ని క్రిస్మస్ సందర్భంగా చూడటం నిజంగా స్వర్గాన్ని చూసినట్లే ఉంటుంది. ప్రత్యేక లైట్లతో వెలిగే రోడ్లు, చర్చిలు, ఇళ్ళు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.
6/ 9
Manali : హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ.. దేశంలోనే ట్రెండీ టూరిస్ట్ స్పాట్లలో ఒకటి. కొత్త జంటలకు హనీమూన్ డెస్టినేషన్ కూడా. ఇది క్రిస్మస్ వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కురుస్తున్న మంచు మీకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది.
7/ 9
Mumbai : ముంబైలో కూడా క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ చర్చిలు, మాల్స్‌ని చక్కగా అలంకరిస్తారు. ఈ సమయంలో మీకు చాలా , ఫుడ్, స్టే ఆఫర్లు లభిస్తాయి.
8/ 9
Delhi : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ సందర్భంగా చలి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ క్రిస్మస్ వేడుక గ్రాండ్‌గా జరుగుతుంది. ఈ సమయంలో ఇక్కడ చాలా థీమ్ పార్టీలు జరుగుతాయి.
9/ 9
Kolkata : దుర్గా పూజకు ప్రసిద్ధి చెందిన కోల్‌కతా నగరం ఈ రోజుల్లో క్రిస్మస్ పార్టీలకు కూడా ప్రసిద్ధి చెందుతోంది. ఈ సమయంలో ఆహార మేళాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.