ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు భయపెడుతున్నాయి. ప్రజలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
ఇలాంటి వైరల్ జ్వరాలు రాకుండా, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వైద్యులు పలు సూచనలు అందిస్తున్నారు.
పిల్లలకు సాధ్యమైనంత వరకు కాళ్లు, చేతులు పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి.
పగలైనా, రాత్రయినా కూడా నిద్రపోయేటప్పుడు మంచంపై తప్పనిసరిగా దోమతెరలు వాడాలి.
మస్కిటో మ్యాట్, మస్కిట్ బ్యాట్, ఇతర మార్గాల్లో దోమలను నియంత్రించాలి.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా పారిశుధ్యలోపం లేకుండా చూసుకోవాలి.
ఇంట్లోని పూలకుండీలను, వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
స్కూలు ఆవరణతో పాటు ఆ పరిసరాలు క్లీన్గా ఉండేలా చూడాలి.
ఫాగింగ్, యాంటీ లార్వా చర్యల ద్వారా దోమలను నియంత్రించాలి.
ఇంట్లోని మంచినీటి ట్యాంకులపై మూతలు పెట్టడం ద్వారా డెంగీ దోమలను దరిచేరనివ్వకుండా చూడొచ్చు.
ఒకవేళ జ్వరం వస్తే వెంటనే వైద్యుడికి చూపించాలి. సొంతంగా మందులు వాడడం వల్ల సమస్య మరింత పెరగొచ్చు.
...