Mosquito Coil effect on health: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.. కానీ అందుకు అవసరమైన స్వచ్ఛమైన గాలి మన పీలుస్తున్నామా అంటే.. లేదనే సమధానం వస్తుంది. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యానికి తోడు జీవన శైలీ, అలవాట్లు మన ఇంట్లోకి చెడు గాలిని పంపిస్తున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం కొందరు కాసేపు తలుపులు, కిటికీలన్నింటినీ తెరుస్తుంటారు. దీంతో గాలితో పాటు దోమలు, పలు కీటకాలు కూడా ఇంట్లోకి వస్తుంటాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనవి దోమలే..
ఎంత ప్రమాదమో తెలుసా..?
నిపుణుల ప్రకారం.. ఒక్కొక్క మస్కిటో కాయిల్ దాదాపు 75 సిగరెట్ల కంటే ఎక్కువ పొగను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీకు, మీ కుటుంబానికి ప్రమాదకరం. ఒక నివేదిక ప్రకారం.. దోమలను చంపే ఈ కాయిల్స్ నుంచి వచ్చే పొగ.. శ్వాసనాళంలో తీవ్ర ఉద్రిక్తతను కలిగిస్తుంది.. అంతేకాకుండా శ్వాసకు అడ్డంకిగా మారి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది.