వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ https://telugu.news18.com/news/business/do-you-want-to-get-additional-income-working-remotely-and-here-some-of-the-common-ways-of-getting-additional-income-including-trading-srd-1126510.htmlఇంట్లో ఉన్న శక్తులు.. మీ ధన ప్రవాహంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మరి కరెన్సీ నోట్లను ఎక్కడ ఉంచాలి? ఏ దిశలో లాకర్ పెట్టాలి? డబ్బు దాచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలను ఇక్కడ తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
క్యాష్ బాక్స్, లాకర్‌ను ఎప్పడూ దక్షిణ దిక్కున పెట్టకూడదట. ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి దక్షిణ దిశ నుంచి వచ్చి... ఉత్తర దిక్కున కూర్చుంటుందట. అందుకే దక్షిణ దిక్కున డబ్బులు ఉంచొద్దని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాగే బాత్రూమ్, కిచెన్, మెట్లు స్టోర్ రూమ్‌కి దగ్గరలో లాకర్లు ఉంచకూడదట. (గమనిక: ఈ అంశాలన్నీ వివిధ సందర్భాల్లో వాస్తు నిపుణులు చెప్పిన అంశాలు. వాస్తు మీద నమ్మకం ఉన్నవాళ్లు వీటిని పాటించొచ్చు.)