* ఫిబ్రవరి 10 : టెడ్డీ డే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా టెడ్డీ అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇంట్రావర్ట్లు తమ మనసులోని భావాలను టెడ్డీలతో షేర్ చేసుకుంటారు. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి టెడ్డీబేర్ ను ఇవ్వడంలో సందేశం ఇదే. ఎలాంటి విషయాన్ని అయినా నాతో షేర్ చేసుకోవచ్చు, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని భరోసా ఇవ్వడమే.
* ఫిబ్రవరి 12 : వాలైంటెన్స్ వీక్ లో ఆరో రోజు హగ్ డే. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా ప్రత్యేకం. కొన్ని భావాలను మాటల్లో చెప్పలేం. ఒక కౌగిలి ద్వారా వారిపై మనకు ఉండే ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను తెలియజేయడానికి, అభిప్రాయ భేదాలు దూరం చేయడానికి, అందమైన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి హగ్ అనేది మంత్రంలా పనిచేస్తుంది.