Ugadi 2023 : మన తెలుగు వారి పండుగ ఉగాది. దాదాపు తెలుగు లాగానే మాట్లాడే కన్నడ వారు కూడా ఉగాది జరుపుకుంటారు. వాళ్లకూ మనకూ చాలా విషయాల్లో పోలికలుంటాయి. ఉగాదిని కూడా వాళ్లు మనలాగే జరుపుకుంటారు. చిన్న చిన్న తేడాలుంటాయంతే... సరే ఇప్పుడు మనం పిండి వంటలపై చెప్పుకుంటున్నాం కదా. ఉగాదికి ఈ పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. అవేంటో చూద్దాం. (image credit - twitter - @Vasantha_KP)
Ugadi Pachadi : ఉగాది పచ్చడి మనకు తెలిసిందే. మనం రెగ్యులర్‌గా మామిడి, వేప పువ్వు, చింతపండు వంటి వాటితో చేసుకుంటాం. కొంతమంది ఈ పచ్చడిలో డ్రైఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. అదీ బాగానే ఉంటుంది. మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. ఐతే.. తీపి, పులుపు, చేదు, వగరు అన్నీ కవర్ అయ్యేలా చేసుకోవాలి. (image credit - twitter - @so0okshma)
Bobbattu or Holige : బొబ్బట్లు మనం ఏటా ఉగాదికి చేసుకుంటాం. భలే ఉంటాయి కదా. వాటి టేస్ట్ వాటిదే. బొబ్బట్లలో మనం బెల్లం, కొబ్బరి, శనగలు, పంచదార వంటివి వేసుకోవచ్చు. బొబ్బట్లను నెయ్యి లేదా పాలతో సెర్వ్ చేస్తారు. వీటిని చెయ్యడానికి కొద్దిగా టైమ్ ఎక్కువ పడుతుంది కానీ.. చాలా టేస్టుగా ఉంటాయి కదా. (image credit - twitter - @Gopins77)
Pulihora : ఏ పండుగైనా పులిహోర ఉంటే భలే ఉంటుంది కదా. పులిహోరను సరిగ్గా చేస్తే.. అందులో కరకరలాడేలా తాలింపు వేస్తే... అక్కడక్కడా చింతపండు పులుపు, తగులుతూ.. పంటికింద వేరుశనగలు నలుగుతూ... నోటికి ఎండుమిర్చి కారం తగులుతూ ఉంటే... అబ్బబ్బా... ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది. అందుకే లిస్టులో ఇదీ పెట్టుకోవచ్చు. (image credit - twitter - @ChinniC19299168)
Obbattu Saaru: ఒబ్బట్టు సాగు అనేది కర్ణాటకలో చేసుకుంటారు. మన పూర్వీకులు కూడా చేసుకునేవారు దీన్ని. బొబ్బట్లు చేసేటప్పుడు.. మిగిలిపోయే పదార్థాలను సూప్ లాగా చేస్తారు. ఇది కూడా రుచికరంగానే ఉంటుంది. దీన్ని భోజనాల్లో అదనపు వంటకంగా వేస్తారు. మీరు బొబ్బట్లు చేసుకుంటే.. ఇదీ చేసుకోవచ్చు. (image credit - twitter - @nekoyamashingo)
Mango Pachadi : మామిడి పచ్చడి ఎలాగూ చేసుకుంటాం. ఉగాది పచ్చడి కోసం మనం మామిడి కాయలు కొనుక్కుంటాం. పనిలో పనిగా మామిడి పచ్చడి చేసుకుంటే.. ఓ నాల్రోజులు తినొచ్చు. దాని టేస్ట్ దానిదే. వేడి వేడి అన్నంలో.. మామిడి పచ్చడి వేసుకొని... లైట్‌గా నెయ్యి కలుపుకొని తింటే.. స్వర్గం కనిపించదూ. కొంతమంది బెల్లంతో మామిడి పచ్చడి చేసుకుంటారు. అదీ బాగానే ఉంటుంది కదా. (image credit - twitter - @Healthyeats793)
Bisi Bele Bath : బిసీ బెలే బాత్ గురించి మనం అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. దీన్ని కూరగాయలు, పప్పులు, సుగంధద్రవ్యాలతో చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో దీనికి సంబంధించిన పొడి ప్యాకెట్స్ లభిస్తున్నాయి. వాటితో కూడా చేసుకోవచ్చు. ప్రజలు దీన్ని ఇష్టంగా చేసుకుంటారు. మన తెలుగు వాళ్లం పెద్దగా చేసుకోం. డిఫరెంట్ టేస్ట్ కావాలంటే దీన్ని చేసుకోవచ్చు. (image credit - twitter - @IyengarShashank)