UAE Health Tips : ప్రపంచంలో అత్యంత బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)గా పిలిచే ఏడు ఎమిరేట్ల గ్రూపులో నిపుణులు.. ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలన్నదానిపై పరిశోధన చేశారు. ఇందులో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్.. మూడు రకాలుగా ఆరోగ్యంగా ఎలా ఉండాలో 6 సూత్రాల ద్వారా తెలిపారు. అవేంటో చూద్దాం.
Mental Health : మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఏదీ పెండింగ్ పెట్టకూడదు. ఎప్పటికప్పుడు సమస్యల్ని సాల్వ్ చేసేసుకోవాలి. తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. నెరవేర్చలేని ప్రామిస్‌లు చేయకూడదు. ఇలా మానసికంగా ఇబ్బంది కలిగే అంశాల్లో ఇరుక్కోకుండా చూసుకోవాలి. తద్వారా మెంటల్ హెల్త్ ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు తెలిపారు.
Micro Workouts : రోజంతా ఏవో ఒక చిన్న చిన్న పనులు చేస్తూనే ఉండాలి. నడవడం, మెట్లు ఎక్కి దిగడం, వస్తువుల్ని అటూ ఇటూ చేర్చడం, పాత్రలు తోమడం, వంట వండటం, బట్టలు ఉతుక్కోవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఆఫీస్‌లో ఆలా కాసేపు తిరగడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. మొత్తం బాడీ అంతా పనిచేసేలాంటి పనులు, వ్యాయామాలు చెయ్యాలి. తద్వారా కేలరీలు కరిగి, గుండె బాగా పనిచేస్తుంది. ఊపిరి బాగా తీసుకోగలరు.
Sleep syncing : రాత్రి చందమామ వచ్చినప్పుడు పడుకోవాలనీ, తెల్లారి సూర్యుడు వచ్చేటప్పుడు లేవాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా శరీరంలో అన్ని అవయవాలకూ పూర్తి విశ్రాంతి లభించి.. బాగా పనిచేస్తాయనీ.. డయాబెటిస్ సహా చాలా రోగాలు రావని చెబుతున్నారు. రోజూ 6 నుంచి 8 గంటలు పడుకోమంటున్నారు. ప్రయత్నించి చూడండి.
Digital Detox : డిటిటల్ పరికరాలకు దూరంగా ఉండాలంటున్నారు. , కంప్యూటర్, ల్యాప్‌టాప్, జూమ్ మీటింగ్స్ ఇలాంటి వాటిని తగ్గించుకోవాలంటున్నారు. ఇవి మెంటల్ హెల్త్‌పై ఎక్కువ నెగెటివ్ ప్రభావం చూపుతాయి అంటున్నారు. కంటి చూపు, కూర్చునే విధానం దెబ్బతినడమే కాదు.. భావోద్వేగాల సమస్యలూ వస్తాయి అంటున్నారు. భోజనం, ట్రావెల్ టైమ్‌లో తోటి వ్యక్తులతో టైమ్ గడపమని చెబుతున్నారు.
Early dinners : ఇది భారతీయులకు కొద్దిగా కష్టమైనది. UAE నిపుణుల ప్రకారం.. సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ చేసేయాలంటున్నారు. అంటే సాయంత్రం 6 నుంచి 7 మధ్యలోనే భోజనం తినేయాలి. దీని వల్ల బాగా నిద్ర పడుతుందనీ, డయాబెటిస్ రాదనీ, మెంటల్ హెల్త్ బాగుంటుందని అంటున్నారు. తిన్న తర్వాత 2 గంటలైనా మెలకువగా ఉండాలంటున్నారు.