తెలుగు రాష్ట్రాల్లో టైఫాయిడ్ పంజా (Typhoid) విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇక, వర్షాకాలం (Monsoon Season) అంటేనే రోగాల కాలం అని పెద్దలు అంటారు. నిజమే. వర్షాకాలంలో ఎన్నో వైరల్ సమస్యలు వస్తుంటాయి. వీటిలో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫ్లూ ఫీవర్ లతో పాటు ఇంకా అనేక సమస్యలు ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ గురించి తెలుసుకుందాం.ఈ టైఫాయిడ్ వస్తే ఏఏ ఆహారాలు తినాలి? ఏవేవి తినకూడదో తెలుసుకోవాల్సిన అసవరం ఉంది.
వానకాలంలో టైఫాయిడ్. , డెంగ్యూ, చికెన్‌గున్యా, కలరా, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటిల్లో టైఫాయిడ్ జ్వరం కొంత ప్రమాదకారనే చెప్పవచ్చు. సాధారణంగా టైఫాయిడ్ జ్వరం కలుషిత ఆహారం, నీళ్ల ద్వారా వ్యాపిస్తుంది. సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సంక్రమిస్తుంది. అయితే నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్లతో ఏవిధంగా టైఫాయిడ్ నుంచి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.
టైఫాయిడ్ ఫీవర్ ను చాలా సులభంగా గుర్తించవచ్చు. శరీరం వేడిగా అయిపోతుంది.తలనొప్పి, విపరీతమైన నీరసం వంటి లక్షణాలుంటాయి. అంతేకాదు జ్వరంలో తీవ్రత ఉంటుంది. అలాగే తలనొప్పి, కడుపునొప్పి, నీరసం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కొంతమందిలో విరేచనాలు కాకుండా మలబద్దకం ఉ:టుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే అది టైఫాయిడ్ గా గుర్తించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఎటువంటి ఆహారాలు తీసుకోవాలో అడిగి తెలుసుకోవాలి. నిపుణులు చెప్పినట్లుగా ఆహారం తీసుకోవాలి.
ఏవి తినకూడదంటే.. : టైఫాయిడ్ జ్వరం వస్తే జీర్ణశక్తి తగ్గిపోతుంది.అందుకే త్వరగా జీర్ణం అయ్యే తేలికపాటి ఆహారాలు తినాలి. ముఖ్యంగా కడుపులో గ్యాస్‌ను పుట్టించే కొన్ని రకాల కూరగాయలు అంటే.. క్యాబేజీ, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ వంటివి అస్సలు తినకూడదు. అలాగే ఘాటులగా ఉండేవి అంటే ఉల్లి,వెల్లుల్లి వంటి కూడా తినకూడదు.
కానీ టైఫాయిడ్ వచ్చినవారికి ఆలూగడ్డల వేపుడు, ఉడికించిన అన్నం.. వంటి కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉండే ఆహారం పెట్టాలి.అలాగే టైఫాయిడ్ నుంచి కోలుకునే ప్రక్రియలో మరిన్ని నీళ్లు తాగడం మాత్రం అస్సలు మానొద్దు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. టైఫాయిడ్ అంటు వ్యాధి కూడా. కాబట్టి టైఫాయిడ్ వచ్చినవారికి దగ్గరగా ఉండకుండా ఉండటం మంచిది.
టైఫాయిడ్ వ్యాధి పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలు.. : టైఫాయిడ్ వస్తే ఒంట్లో శక్తి హరించుకుపోతుంది.నీరసరం నిస్సత్తువ ఆవరిస్తుంది. కాబట్టి తినాలని లేకపోయిన తరచు ఏదోక ఆహారం తింటుండాలి. తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. నీరసరం రాకుండా. టైఫాయిడ్ సమయంలో శరీరంలో ఉండే నీటిశాతం హరించుకుపోతుంది.
అలాగే జ్వరం తీవ్రతతో చెమటపడుతుంది. అలాగే వాంతులు విరేచనాలతో డీ హైడ్రేషన్ వస్తుంది. కాబట్టి ద్రవాహారాలు తప్పకుండా తీసుకోవాలి. ఆ సమయంలో శరీరం చైతన్యవంతం చేయడానికి..హైడ్రేట్ చేయడానికి మరియు ఎలెక్ట్రోలైట్ బ్యాలన్స్ కొనసాగించడానికి ఆరోగ్యకరమైన ద్రవాలను త్రాగాలి. టైపాయిడ్ సమయంలో కొన్నిరకాల పదార్థాలు జీర్ణం కావు. కాబట్టి మెత్తగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇలా టైఫాయిడ్ కు పలు ఆహార జాగ్రత్తలు చాలా చాలా అవసరం.