Weight Loss: పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు
Weight Loss: పియర్స్ తినండి... బరువు తగ్గండి... ఎన్నో ప్రయోజనాలు
Health Benefits of Pears Fruit: తక్కువ తీపితో రుచికరంగా ఉండే పియర్స్ పండ్లను తింటే... బరువు తగ్గడమే కాదు... టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా తగ్గుతున్నాయి. వాటిలో ఫైబర్ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తోంది.
యాపిల్ పండులాగే... చక్కటి రుచితో ఆకట్టుకుంటాయి పియర్స్ పండ్లు. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ఎవరైనా వీటిని తినవచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌గా పిలుస్తున్నారు. వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.
2/ 11
పియర్స్‌లో కాల్షియం, ఫొలేల్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, ఖోలైన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.
3/ 11
రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
4/ 11
డయాబెటిక్స్ ఉన్న వారు అన్ని రకాల పండ్లూ తినకూడదు. కానీ... పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ కేలరీలతో, ఎక్కువ ఫైబర్ (పీచు పదార్థం)తో అందరూ తినేందుకు వీలవుతోంది. పైగా ఇందులో మన శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి.
5/ 11
డయాబెటిక్స్ ఉన్నవారు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇదో పెద్ద ఛాలెంజ్. డయాబేటిస్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి టైప్-1, రెండోది టైప్-2. వ్యాధి ఎదుగుదల, షుగర్ లెవెల్స్ వంటి అంశాల్ని లెక్కలోకి తీసుకొని... దీన్ని విభజించారు.
6/ 11
హై బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నార్మల్‌కి తీసుకురాలేకపోతే, అవి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. రెగ్యులర్ ట్రీట్మెంట్, సరైన ఆహారం, ఎక్సర్సైజ్ వంటివి చేస్తుంటే, అధిక బరువు తగ్గడమే కాకుండా... షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
7/ 11
పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల... మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పద్ధతిగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్‌ను ఈ పండ్లు తగ్గిస్తున్నాయని పరిశోధనల్లో తేలింది.
8/ 11
2లక్షల మందిపై ఓ పరిశోధన చేశారు. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ రెడ్ పియర్స్ పండ్లను తినమన్నారు. అలా తిన్నవాళ్లకు టైప్ 2 డయాబెటిస్ 23 శాతం తగ్గుతున్నట్లు తెలిసింది.
9/ 11
పియర్స్‌లో ఎక్కువ భాగం నీరు, పీచ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే... పొట్ట నిండిపోయిన ఫీల్ కలుగుతుంది. అందువల్ల ఇతరత్రా ఆహారాలు తినరు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం తప్పుతుంది.
10/ 11
ఈ పండ్లలోని పెక్టిన్ అనే పదార్థం... పియర్స్‌ను త్వరగా డైజెస్ట్ (జీర్ణం) కాకుండా చేస్తుంది. ఓ సర్వే ప్రకారం... రోజుకు రెండు పియర్స్ తినేవాళ్లకు నడుం చుట్టూ ఉండే కొవ్వు తగ్గి... నడుం సైజ్... 1.1 ఇంచులు (2.7 సెంటీమీటర్లు) తగ్గిందని తేలింది.
11/ 11
టేస్ట్ బాగున్నాయి కదా అని పియర్స్ మరీ ఎక్కువగా తిన్నా ప్రమాదమే. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే... కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం, నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా సరే అతి అనర్థమే. కాబట్టి... సరిపడా తింటూ... ఆరోగ్యాన్ని పెంచేసుకుంటే చాలు.