సుగంధ ద్రవ్యాలు వాడాలి : మన అదృష్టమేంటంటే... మన ఇండియాలో... సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. ఆ స్పైసెస్లో మంచి రుచి మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు... ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి.