మెనోపాజ్ సమస్యంలో వేడి ఆవిర్లు పుట్టడం, అధికంగా చెమటలు పట్టడం, నిద్రలేమి, ఛాతి తగ్గిపోవడం, జుట్టు రాలడం, లైంగిక వాంఛ లేకపోవడం, హార్ట్‌బీట్ పెరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మెనోపాజ్ సమస్యలు దూరం కావాలంటే ఎక్కువగా పోషకాహారం తీసుకోవాలి. దీనివల్ల సమస్య చాలావరకూ అదుపులో ఉండడమే కాకుండా.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఉంటుంది.
కాఫీ, టీ, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఇందులోని కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి కాబట్టి.. వీటిని ఎంతగా తగ్గిస్తే అంత మంచిది.
అధికబరువుతో ఇబ్బందులు అధికమవుతాయి. కాబట్టి బరువుని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఎప్పటికప్పుడూ బరువు చెక్ చేసుకోవడం మంచిది.
అధికరక్తస్రావం, గుండె వేగంగా కొట్టుకోవడం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండడం చేస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.