Teddy Day 2023: ఈ టెడ్డీలను చూస్తే కొనకుండా ఉండలేరు..ధర మాత్రం వాచిపోతుంది!
Teddy Day 2023: ఈ టెడ్డీలను చూస్తే కొనకుండా ఉండలేరు..ధర మాత్రం వాచిపోతుంది!
Teddy Day 2023: టెడ్డీబేర్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. వాలెంటైన్స్డేలో నాలుగో రోజు టెడ్డీ డే. ప్రతిఏడాది ఫిబ్రవరి 10న ఈ టెడ్డీ డేను జరుపుకుంటారు. తమ లవర్‌కు టెడ్డీని గిఫ్ట్‌గా ఇచ్చే ప్రేమికులు కోట్లలో ఉంటారు. అందుకే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే గిఫ్ట్స్‌లో టెడ్డీ బేర్ కూడా ఒకటి. అయితే కొన్ని టెడ్డీ బెర్స్ యమ కాస్ట్లీ.. లక్షలు పోసి కొనాల్సిందే!
10: హ్యాపీ స్టెఫ్ బేర్- 44లక్షల రూపాయల టెడ్డీ బేర్ ఇది. స్టెఫ్ మెర్రీ మొహైర్ దీన్ని 1926లో ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. సైన్ ఆఫ్ ఎండ్లెస్ లవ్‌గా ఈ టెడ్డీని పిలుస్తారు. Image source Expensive World.com
2/ 10
09: హార్లెక్విన్ బేర్- 1925లో స్టెఫ్ కంపేనీ దీన్ని తయారు ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టెడ్డీబేర్లలో ఇది ఒకటి. ఈ టెడ్డీకి హార్లెక్విన్ అని పేరు పెట్టారు. ఈ టెడ్డీ ఖరీదు 48లక్షల రూపాయలు. Image source Expensive World.com
3/ 10
08: బ్లూ ఇలియట్ బేర్- బ్రిటిష్ డిపార్ట్మెంట్ స్టోర్ హెరాల్డ్స్ కంపెనీ కోసం ఇలియట్‌ను తయారు చేసినట్లు భావిస్తారు. ఈ టెడ్డీ ఖరీదు 51లక్షల రూపాయలు. Image source Expensive World.com
4/ 10
07: డైమండ్ ఐస్ బేర్- జర్మన్ స్టెఫ్ కంపెనీ తయారు చేసిన మరో ప్రతిష్టాత్మక ఖరీదైన టెడ్డీబేర్ ఇది. దీని ధర 67లక్షల రూపాయలు. Image source Expensive World.com
5/ 10
06: స్టెఫ్ ఓల్డ్ టెడ్డీ బేర్- 1904లో తయారైన ఈ టెడ్డీ.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెడ్డీబేర్. దీనిని కూడా స్టెఫ్ కంపెనీనే తయారు చేశాడు. దీని ధర 84లక్షల రూపాయలు. Image source Expensive World.com
6/ 10
05: సుప్రీం లూయిస్ విట్టన్ టెడ్డీ బేర్- ఈ సుప్రీమ్ ఎక్స్ లూయిస్ విట్టన్ టెడ్డీబేర్ ఫ్యాషన్ రాయల్టీ బ్రాండింగ్‌కు అడ్డా. దీని ఖరీదు 84లక్షల 84వేల రూపాయలు. ఈ టెడ్డీకి వచ్చే ఆదాయాన్ని బీబీసీ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఫౌండేషన్‌కు ఇస్తుంది. Image source Expensive World.com
7/ 10
04: స్టెఫ్ టైటానిక్ - 1912లో, టైటానిక్ మునిగిన తరువాత చనిపోయాన వారికి సంతాపంగా ఈ టెడ్డీలను స్టెఫ్ కంపెనీ తయారుచేసింది. దీని ఖరీదు ఏకంగా కోటి 8లక్షల రూపాయలు. Image source Expensive World.com
8/ 10
03: స్టెఫ్ టెడ్డీ గర్ల్ బేర్- బ్రిటీష్ కల్నల్ బాబ్ హెండర్సన్కి ఈ గిఫ్ట్ ఇచ్చారు. దీని ఖరీదు ఏకంగా కోటి 14లక్షల రూపాయలు. Image source Expensive World.com
9/ 10
02: లూయిస్ విట్టన్ మోనోగ్రామ్స్- ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన టెడ్డీబేర్ ఇది. ఎల్వీ బ్రాండ్ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ టెడ్డీబేర్‌ను రూపొందించారు. ఈ టెడ్డీ బేర్ ఖరీదు కోటి 45లక్షలు. Image source Expensive World.com
10/ 10
01: స్టెఫ్ లూయిస్ విట్టన్ టెడ్డీ బేర్- మొగల్స్ లూయిస్ విట్టన్, స్టెఫ్లు క్రియేట్ చేసిన ఈ టెడ్డీబేర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఈ టెడ్డీ బేర్ విలువ అక్షరాలా 16కోట్ల రూపాయలు. Image source Expensive World.com