Tomato Health Benefits: టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Tomato Health Benefits: టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Health Benefits of Tomato: టమాటాలను సూపర్ ఫుడ్ అంటారు. వాటిలో ఎన్నో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో 3వేల రకాల టమాటాలున్నాయి. వాటితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
టమాటాల్లో కాన్సర్‌ను అడ్డుకునే గుణాలున్నాయి. వాటిలో ఉండే లైకోపీన్... కొలన్, ప్రొస్టేట్, లంగ్ కాన్సర్లను అడ్డుకుంటోంది.
2/ 10
రక్తం గడ్డ కడితే మంచిదే. అతిగా గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అలా జరిగితే, గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే టమాటాలు తినాలి.
3/ 10
బీపీని తగ్గించే లక్షణాలు టమాటాలకు ఉన్నాయి. డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు ఉండేవారు టమాటాలు తింటే మంచిది.
4/ 10
టమాటాలు మన శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్‌ని మెయింటేన్ చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎన్ని టమాటాలు తింటే అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.
5/ 10
మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి. వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
6/ 10
టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్... కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
7/ 10
చర్మం కోమలంగా ఉండాలంటే టమాటాలు తినాలి. వాటిలోని బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. ముసలితనం రాకుండా కాపాడతాయి.
8/ 10
ఎముకలు బలంగా, ధృడంగా ఉండాలంటే టమాటాలు తీసుకోవాలి. వాటిలోని మెగ్నీషియం ఎముకలకు మేలు చేస్తుంది.
9/ 10
ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని టమాటాలు తింటే అంత మంచిది. పుట్టే పిల్లలు అత్యంత ఆరోగ్యంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా పుడతారు.
10/ 10
శరీరంలో రక్తం సరిగా లేనివారూ, అనీమియా (రక్త హీనత)తో బాధపడేవారు టమాటాలు తింటే, వాటిలోని సీ విటమిన్... ఐరన్ పెరిగేందుకు దోహదపడతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ... రోజూ రెండు టమాటాలైనా తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. (Image : Reuters)