పొద్దున లేవగానే.. కాలకృత్యాలు తీరిన తర్వాత ఎవరికైనా చాయ్ తాగడం అలవాటు. కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారైతే అల్లం ఛాయ్ ను ఎక్కువగా తీసుకుంటారు. ఇది తాగడం వల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. తలనొప్పికి కూడా మంచి మందు. ఉదయం, సాయంత్రమైనా అల్లం టీని ఒక కప్పు సేవిస్తే ఆ మజానే వేరు. (ప్రతీకాత్మక చిత్రం)
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అల్లం టీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కవగా అల్లం తీసుకుంటే అది గర్భస్రావానికి కూడా దారి తీసే ముప్పు ఉంది. సాధారణంగా రోజుకు 1500 మిల్లీగ్రాముల అల్లం తినాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో అల్లం తీసుకుంటే గర్భిణీలకు ప్రమాదం. (ప్రతీకాత్మక చిత్రం)