పిల్లల కోసం భార్యాభర్తలు ఎంతో తపిస్తుంటారు. ఎక్కడో కొన్ని జంటలు మాత్రం పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఉంటాయి.
2/ 8
పిల్లలు కావాలనుకునే జంటలు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి.
3/ 8
అందులో ప్రధానమైనది మద్యపానం. మందు తాగడం మానేస్తే మంచి పిల్లలు పుడతారట.
4/ 8
తమకు పుట్టబోయే పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంతో ఉండాలంటే పురుషులు, తమ భార్యలు గర్భం ధరించడానికి 6 నెలలు ముందుగానే ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
5/ 8
తద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను నిరోధించవచ్చని చెప్తున్నారు.
6/ 8
మహిళలు తమ గర్భధారణకు ఏడాది ముందు నుంచే ఆల్కహాల్ మానేయాలని తెలిపారు.
7/ 8
ఆల్కహాల్ తీసుకొన్నవారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువని చెప్పారు.
8/ 8
దాదాపు 30 ఏళ్ల డాటా ఆధారంగా, 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.