Photos: కొవ్వు పదార్థాలు తిని బరువెలా తగ్గాలో తెలుసా?
Photos: కొవ్వు పదార్థాలు తిని బరువెలా తగ్గాలో తెలుసా?
బరువు తగ్గడం ఓ పెద్ద సవాల్. కాస్త బరువు పెరిగినట్టు అనుమానం వస్తే చాలు... ఇక డైట్లో మార్పులు చేస్తారు. జిమ్‌కు వెళ్తారు. కొవ్వు పదార్థాలు తగ్గించేస్తారు. కానీ... కొవ్వు పదార్థాలు తిన్నా బరువు తగ్గొచ్చని తెలుసా? ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోండి.
ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరూ బరువు తగ్గేందుకు ఎక్కువగా కష్టపడుతుంటారు. దీనికోసం ఎన్నో వర్కవుట్స్‌తో పాటు.. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటివారు కొన్ని ఆహారపదార్థాలను తీసుకుని బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు... అవేంటో ఇప్పుడు చూద్దాం..
2/ 9
సాధారణంగా కొవ్వు పదార్థాలను తినడం ద్వారా బరువు పెరుగుతున్నామని చాలా బాధపడుతుంటారు. అయితే కొంతమంది పోషకాహార నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారు కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించకూడదు.
3/ 9
మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. దీనిద్వారా.. పొట్ట నిండిన అనుభూతితో పాటు.. తిన్న ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
4/ 9
మరి మాంసకృత్తులు ఉన్న ఆహారమేంటంటే.. గుడ్డు, వెన్నతీసిన పాలు, సోయా వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
5/ 9
నాన్వెజ్టేరియన్స్ అయితే చికెన్‌ని ఎంచుకోవచ్చు. దీంతో.. ఎక్కువగా ఆహారం తీసుకోరు. అయితే అదికూడా మితంగా తీసుకోవాలి.
6/ 9
రోజూ పీచుపదార్థాలను అధికంగా తీసుకోవాలి. అంటే ఓ యాపిల్, బ్లాక్‌బీన్స్ లేదా రాజ్మా కూడా బరువుని తగ్గిస్తుంది.
7/ 9
జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండి.. ఎక్కువ లిక్విడ్ ఐటెమ్స్ తీసుకోవాలి.
8/ 9
నట్స్, గింజలు ఎక్కువగా తీసుకోవాలి.. వీటితో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
9/ 9
ఆలివ్ నూనె కూడా బరువుని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది.