THIS IS WHAT TO DO BEFORE AND AFTER GETTING VACCINATED MK
Covid vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే సమయంలో..పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ టీకా జోరు అందుకుంది. ఈ నేపథ్యంలో టీకా కోసం అందరూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
1. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
2/ 10
2. ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే ముందు మీరు చేయాల్సిన వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకోండి. పూర్తి రెస్ట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి.
3/ 10
3. వ్యాక్సిన్ తీసుకునే ముందు మనస్సులో ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోకండి. వ్యాక్సిన్ మిమ్మల్ని పరిపూర్ణ ఆరోగ్యం వైపు నడిపిస్తుందనే విషయం గుర్తుంచుకోండి.
4/ 10
4. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోండి. వీలైతే పుష్కలంగా మంచి నీరు తాగండి.
5/ 10
5. శరీరం జ్వరం లేదా, కండరాల నొప్పులు అనిపించినప్పటికీ, డైట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. పోషకాహారం తీసుకోండి.
6/ 10
6.వ్యాక్సిన్ తీసుకునే ముందే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన పెంచుకోండి.
7/ 10
7. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కూడా కోవిడ్ నిబంధనలు పాటించడం మర్చిపోవద్దు. పూర్తి స్థాయిలో యాంటీబాడీలు శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే వరకూ మాస్క్ తప్పనిసరి.
8/ 10
8.వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మీరు అరగంట పాటు కేంద్రంలోనే ఉండేందుకు ప్రయత్నించండి. వాంతులు, తలనొప్పి లాంటి సూచనలు వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
9/ 10
9. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నప్పటికీ వాయిదా వేసుకొని పూర్తిగా రెస్ట్ తీసుకోండి.
10/ 10
10. ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపు కనిపించినట్లయితే, ఐస్ ప్యాక్ కానీ, వెచ్చటి నీటితో గుడ్డను తడిపి పెట్టడం కానీ చేయండి.