‘స్మార్ట్’ప్రపంచం అభిరుచులకు తగినట్లే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ వాచీల సంస్థ ట్యాగ్ హ్యుయర్ స్మార్ట్ వాచ్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బిల్లియనీర్ల డిమాండ్‌కు తగ్గట్లు సరికొత్త స్మార్ట్ రిస్ట్ వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. (Photo: TAG Heuer)
ఒక స్మార్ట్ వాచీకి 23.35 క్యారెట్లకు సమానమైన 589 వజ్రాలను అతికించారు. పూర్తిగా పాలిష్ చేసిన 18 క్యారెట్ల తెల్ల బంగారాన్ని ఇందులో వాడారు. ఇలా తయారుచేసినదే ‘ట్యాగ్ హ్యుయర్ కనెక్టడ్ మాడ్యులర్ 45 ఫుల్ డైమండ్’ వాచీ.(Photo: TAG Heuer)
జెనీవా మార్కెట్లో విడుదల చేసిన ఈ వాచ్ ఖరీదు 1,97,000 డాలర్లు (దాదాపు రూ.1.4 కోట్లు). ప్రపంచంలో ఆండ్రాయిడ్‌తో పనిచేసే అత్యంత ఖరీదైన వాచీ ఇదే కావడం విశేషం. అమోల్డ్ టచ్ స్క్రీన్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఈమెయిల్, గూగుల్ అసిస్టంట్, ఆండ్రాయిల్ ప్లే వంటివి దీని ప్రత్యేకతలు. వాటర్ రెసిస్టన్సీ కూడా దీని సొంతం. (Photo: TAG Heuer)