World diabetes day 2019 : నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినం (World Diabetes Day). ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ... డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నాయి. మనం ఏం తిన్నా... అందులోని షుగర్ (గ్లూకోజ్ లేదా పిండిపదార్థం)... రక్తంలో కలుస్తుంది. ఐతే... రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైతే... ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇన్సులిన్ అనేది మన బాడీని, బ్లడ్‌నీ కంట్రోల్ చేస్తుంది. సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే... బీపీ వచ్చి... హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఓవరాల్‌గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేలా చేసుకోవడం, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అవ్వకుండా చూసుకోవడం... డయాబెటిస్ ఉన్నవారి టార్గెట్ అనుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలు... రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యగలవు. వాటినే సూపర్‌ఫుడ్ అని పిలుస్తున్నారు ఈ రోజుల్లో. ఈ సూపర్‌ఫుడ్ ఎంత తింటే అంతగా డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల అవేంటో తెలుసుకుందాం.
1. Walnuts : ఎక్సర్‌సైజ్‌లూ, వర్కవుట్స్ చేసేవారు వాల్నట్స్ బాగా తింటుంటారు. ఎందుకంటే ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలాగే డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. ఇవి డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మంచివి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని సాయంత్రం వేళ స్నాక్స్‌లా కొద్దిగా తీసుకుంటే మేలు.
2. Cinnamon : దాల్చిన చెక్కతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది PCODకి చాలా మంచిది. అలాగే బరువు తగ్గేందుకు, డయాబెటిస్ తగ్గేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఇలా చాలా లాభాలున్నాయి. భోజనం తర్వాత రక్తంలో కలిసే గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది.
3. Citrus foods : ఉసిరి, నిమ్మకాయతో చేసే ఆహార పదార్థాల్లో గ్లైకామిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు నిమ్మకాయ, ఆరెంజ్, కివి, ద్రాక్ష, ఉసిరి వంటి వాటిని డైట్లో చేర్చుకోవచ్చు. ఐతే... జ్యూస్‌లా మాత్రం తాగవద్దు. జ్యూస్‌లా తాగితే... గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి.
4. Turmeric : పసుపులో చాలా ఔషధ గుణాలున్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం... రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఓసారి డాక్టర్‌ను కనుక్కొని... ఎంత పసుపు వాడాలో తెలుసుకొని వాడితే మంచిదే అంటున్నారు ప్రపంచ ఆరోగ్య నిపుణులు. (credit - twitter - Jai Commerical Centre)
5. Almonds : బాదంను డైట్లో చేర్చుకుంటే మంచిదే. రోజుకు 6 నుంచీ 8 బాదంలు తినవచ్చు. బాదంలో మెగ్నీషియం ఎక్కువ. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. గుండెకు కూడా మేలు చేస్తుంది.
6. Apple cider vinegar : యాపిల్ సైడెర్ వెనిగర్ కూడా ఆరోగ్యానికి మంచిదే. రాత్రివేళ పడుకునే ముందు డ్రింకులా దీన్ని తాగుతుంటారు. ఫలితంగా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. గోరువెచ్చటి నీటిలో ఓ చెంచాడు (Teaspoon) యాపిల్ సైడెర్ వెనిగర్‌ను వేసి... కలిపి తాగితే మేలు జరుగుతుంది.
7. Eggs : డయాబెటిస్ ఉన్నవారు... బ్రేక్‌ఫాస్ట్ అనగానే గుడ్లను గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే వారికి గుడ్లు చాలా మంచివి. రోజూ ఒకే రకంగా కాకుండా రకరకాలుగా వండుకొని తింటే... బోరు కొట్టదు. గుడ్లలో ప్రోటీన్స్ మేలు చేస్తాయి.
ఇలాంటి ఆహారాలు తింటూ... ఎప్పటికప్పుడు డయాబెటిస్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకుంటూ... ఏయే ఆహారాలు తింటున్నప్పుడు డయాబెటిస్ తగ్గుతోందో గ్రహించుకోగలిగితే... అలాంటివి లిస్టు రాసుకొని అవే ఎక్కువగా తింటూ ఉంటే... ఆటోమేటిక్‌గా డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. డాక్టర్ల సలహాలు కూడా పాటిస్తే... ఇబ్బందులు రాకుండా ఉంటాయి.