గులాబీ పూలలో విటమిన్ ఏ, బీ, సీ ఉంటాయి. వేసవిలో తలనొప్పి తగ్గించేందుకూ.. చల్లదనం కలిగించేందుకూ ఈ పూలు బాగా పనిచేస్తాయి. గర్భిణీలకు కూడా ఇవి మేలు చేస్తాయి. రోజా పూలతో తయారుచేసే గుల్కండ్ను చాలా మంది తింటారు. అది కూడా ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ సమస్యల్ని పోగొడుతుంది. దగ్గు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యల్ని రోజాపూల రేకలు పరిష్కరిస్తాయి. అందువల్ల కడిగిన రోజా పూల రేకలను తినడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.