సాధారణం మనం ఏ పని చేయాలన్నా.. దాన్ని మెదడుతోనే ఆలోచించి చేస్తాం. రంగు, రుచి, వాసన ఇవన్ని గుర్తించాలన్న మన మెదడుతో మమేకమై ఉంటుంది. అటువంటి బ్రెయిన్‌కు ఆరోగ్యకరంగా ఉంచడానికి కొన్ని హెల్తీ ఫుడ్స్‌ను తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం. సాధారణంగా మనం పుట్టి 3 ఏళ్లు అవ్వగానే దాదాపు 80 శాతం బ్రెయిన్ అంతా డెవలప్ అయిపోతుందట. ప్రస్తుతం చాలా మంది జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. దీంతో ముఖ్యమైన పనులు లేదా ఇతర అంశాలను మరచిపోవడానికి దారితీస్తుంది. ఇవన్నీ జ్ఞాపకశక్తి కోల్పోతున్నారని సంకేతం కావచ్చు.
వాల్నట్స్..
వాల్న ట్స్ ఆకృతి చూస్తే కూడా మన మెదడు ఆకారంలో కనిపిస్తుంది. వాల్నట్ మెదడు పనితీరుకు ప్రధానంగా సహాయపడుతుంది. ఒక ఔన్స వాలనట్లో 4 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల ఫైబర్, కార్బొహైడ్రేట్లు, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, సెలీనియం, విటమిన్ బీ, ఈ, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది. ఒమేగా ఫ్యాటీ 3 ఫ్యాటీ యాసిడ్స్, పాలీఫెనాల్స్‌లో కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని రోజూ తినడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు.