నేటి వేగవంతమైన జీవితంలో ఎక్కువ మంది ఫుడ్, డ్రింక్స్ పై శ్రద్ధ చూపడం లేదు. వయసుతోపాటు వ్యాధులు పెరుగుతున్నాయి. అందుకే ముఖం చర్మం వదులుగా కూడా త్వరగా మారుతుంది. అయితే, మంచి పనికి ఎప్పుడూ లేట్ చేయకూడదని గుర్తుంచుకోండి. శరీరానికి కాదు, మనసుకు మేలు చేసే ఆహారపదార్థాలను మనస్తత్వవేత్తలు మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని తెలిపారు. దీంతో ఏకాగ్రత పదునుగా చేయడంలో సహాయపడుతుంది.మన మెదడు ఆరోగ్యం కోసం కొన్ని రకాల పుడ్స్ కు దూరంగా ఉండాలి. ఆ వివరాలు తెలుసుకుందాం
హార్వర్డ్ మెడికల్ స్కూల్ పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఉమా నాయుడు దీనిపై మాట్లాడుతూ.. మనసును, ఏకాగ్రతను పదునుగా ఉంచుకోవడానికి 5 రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దిస్ ఈజ్ యువర్ బ్రెయిన్ ఆన్ ఫుడ్ రచయిత అయిన ఆమె పేగు బాక్టిరియా జీవక్రియ ప్రక్రియను ఎలా ప్రేరేపిస్తుందో, ఈ ప్రక్రియలు మెదడులో మంటను ఎలా కలిగిస్తాయో అధ్యయనం చేస్తున్నారు. దీంతో మెమోరీని ప్రభావితం చేసే కొన్ని ఆహారానలను విస్మరించడం ద్వారా మనం చిత్తవైకల్యం వంటి అనారోగ్యాన్ని పెరగకుండా చేసే ప్రమాదాన్ని బాగా తగ్గించుకోవచ్చని ఇప్పటి వరకు అధ్యయనాలు చూపిస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, వేగంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చని, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు.
కణాల శక్తి ఉత్పత్తిలో గ్లూకోజ్ రూపంలో చక్కెరను ఉపయోగిస్తున్నప్పటికీ అధిక చక్కెర ఆహారం మెదడులోకి మరింత గ్లూకోజ్‌ను తీసుకువస్తుంది. ఇది మెమొరీపై మరింత హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఫ్రై చేసిన, సోడాతో సహా అధిక చక్కెర ఉన్న ఆహారాలు మెదడులో గ్లూకోజ్ మొత్తం పెంచడానికి పని చేస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం పురుషులు రోజుకు 36 గ్రాముల కంటే ఎక్కువ చక్కెరను మహిళలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.
చక్కెర తర్వాత రెండో అత్యంత ప్రమాదకరమైన ఫుడ్ ఆయిల్ ఫుడ్స్జ ఇందులో సమోసా, కచోరీ, చికెన్ ఫ్రై, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు.కానీ, ఈ ఆహారానికి దూరంగా ఉండాలని మానసిక ఆరోగ్య బాగుండాలంటే ఇది తప్పనిసరి అంటున్నారు. ఈ ఆయిల్ ఫుడ్ మెదడు నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది రక్తనాళలను దెబ్బతీస్తుంది. అంతేకాదు, ఇది మెదడుకు రక్త సరఫరాపై ప్రభావం చూపుతుంది. ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినే వ్యక్తుల జీవితంలో తర్వాతి కాలంలో డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
చాలా మంది తమ జీవితంలో ఒత్తిడిని తట్టుకోవడానికి వారాంతాల్లో మద్యం తాగుతారు. కానీ, ఆల్కహాల్ మెదడుపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని వినియోగం వల్ల డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది అనేక అధ్యయనాల ద్వారా నిర్ధారితమైంది. సాధారణంగా వారానికి ఒక్కసారి కంటే ఎక్కువ తాగేవారిలో మెమోరీ సమస్య ఉంటుంది.
తక్కువ ధరలు ఉన్న పానీయాల్లో ఉండే నైట్రేట్లు డిప్రెషన్‌కు నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. కానీ, వాటిని సంరక్షణకారిగా, అనేక ఆహార పదార్థాల రంగును మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది డెలి స్లైసెస్, బేకన్, సలామీ, సాసేజ్ వంటి మాంసం వంటల్లో కూడా ఉపయోగిస్తారు. బైపోలార్ డిజార్డర్ సంభావ్యతను పెంచే విధంగా నైట్రేట్లు పేగు బాక్టిరియాను మారుస్తాయని ఇటీవలి అధ్యయనాలు సూచించాయి.