ఈరోజుల్లో యువతీయువకులు కెరీర్లో సెటిల్ అవ్వాలన్న తపనతో పెళ్లి చేసుకోవాలన్న విషయాన్నే మర్చిపోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగాలని పెద్దలు అంటుంటారు. కానీ ఇప్పట్లో చాలామంది ఈ మాటను కొట్టిపారేస్తున్నారు. చివరికి పెళ్లికాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. కెరీర్లో సెటిల్ అవ్వాలనుకోవడం మంచిదే. కానీ దానికి కూడా ఓ టైం ఉంది.
పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో దాదాపుగా జీవితంలో స్థిరపడాలి. లేకపోతే భవిష్యత్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి సమాజపరమైనవి కావచ్చు. సంతానపరమైనవి కావచ్చు. అయితే 30 ఏళ్లు పైబడినా పెళ్లి చేసుకోని బ్యాచిలర్ యువకుల గురించి తోటి వారు ఏమనుకుంటారన్న విషయంపై ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. మీరు మీలానే వున్నా కూడా ప్రజలు మిమ్మల్ని బాధ్యత లేని వాడనో లేక పరిపక్వత లేని వాడనో అనుకుంటారు.