నాన్‌వెజ్, ముఖ్యంగా రెడ్ మీట్ ఎక్కువగా తింటే, తింటే మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసం వినియోగం ఎక్కువైతే వివిధ ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధనలు సైతం ధ్రువీకరించాయి. ఈ నేపథ్యంలో రెడ్ మీట్ వినియోగం మితిమీరితే ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్‌ను నిపుణులు వివరించారు. అవేంటో తెలుసుకుందాం.
* రక్తం ఆమ్లత్వం : యానిమల్ మీట్ ఎక్కువగా తినే వారి రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల పోషకాలను శరీరం సంగ్రహించలేదు. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ప్రభావం పడి, అవి బలహీనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, ఇది ఎముకల నుంచి కాల్షియం తొలగిపోయేందుకు దారితీస్తుంది.
* కాల్షియం స్థాయి తగ్గుతుంది : ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. జంతువుల నుంచి లభించే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో మాసం వినియోగం పెరిగితే, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీంట్లో ఫాస్పరస్- కాల్షియం నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికం చేస్తుంది. ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారుతుంది.