కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండాలోని నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటి ని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. దానికి కారణం ఏంటంటే.. 61 శాతం మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడాని కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ సమస్యలు ఉన్నవారు పచ్చికొబ్బరిని రోజూ తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతే కాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చెయిన్ ట్రై గ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కీటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చికొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కారం కాదని వైద్య నిపుణలు చుబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)