రిలేషన్ షిప్లో మైండ్ రీడింగ్ టిప్స్ కనిపెట్టడం అంటే... వారి సీక్రెట్స్ తెలుసుకోవడం కాదు. వాళ్లకు ప్రెజంట్ ఏం కావాలి? ఎలా ఉన్నారు? అని తెలుసుకోవడం. దీంతో మీ వైఫ్ ను సులభంగా అర్థం చేసుకోవచ్చు. లేదా మీ భర్త మానసికంగా ఏం ఫీలవుతున్నాడో కనిపెట్టయోచ్చు. దీనివల్ల మీ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అందుకే రిలేషన్ షిప్లో ఉపయోగపడే 5 మైండ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకుందాం. (Mind reading techniques in relationship)
బాడీ లాంగ్వేజ్..
ముఖ్యంగా మీ పార్ట్నర్ బాడీ లాంగ్వేజ్ ను చూడండి. ఆ తర్వాత వారు మాట్లాడే టోన్, ఫెషియల్ ఎక్స్ప్రెషన్, కళ్లు, బాడీ పోస్చర్ ఇవన్నీ వాళ్లు మానసికంగా ఎలా ఉన్నారో సులభంగా గుర్తించే విధానాలు. ఇదంగా బాడీ లాంగ్వేజ్ లో భాగమే. ఒకవేళ వారు నవ్వుతూ ఉండి.. కళ్లలో ఏదో టెన్షన్ కనిపించినా.. అది ఫేక్ స్మైల్ అవుతుంది. (Mind reading techniques in relationship)
కళ్లు..
కళ్లతో వారి మనస్సేంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీ పార్ట్నర్ కళ్లు చూడగానే మీకు అర్థమయిపోతుంది. వాళ్లు నిజం అబద్దం చెబుతున్నారా? నిజం చెబుతున్నారా? అని.. మీరు మాట్లాడేటప్పుడు వారు నేరుగా మీ కళ్లలో చూస్తూ మాట్లాడితే.. వాళ్లు మాట్లాడేది నిజమే. మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారు. రియల్ లవ్ అని అర్థం. (Mind reading techniques in relationship)
టోన్..
రిలేషన్ షిప్లో ఫోన్లో మాట్లాడటానికి లేదా నేరుగా కలిసి మాట్లాడటానికి కారణం ఉంటుంది. ఫోన్ ఛాటింగ్ వల్ల వాళ్ల మాట్లాడే తీరు మీకు అర్థం కాదు. ఉదాహరణకు మీరు వారితో మాట్లాడితే టోన్ డీప్ గా అనిపిస్తే... వారు కోపంగా ఉన్నారని అర్థమవుతుంది. వాళ్ల మాటల్లో టోన్ పెరిగినా.. తగ్గినా.. రెండిటికీ కారణం కూడా వారితో ఫోన్లో లేదా నేరుగా మాట్లాడితేనే అర్థమవుతుంది. (Mind reading techniques in relationship)
బ్రీథింగ్..
ఇది కూడా రిలేషన్ షిప్ మైండ్ రీడింగ్‌లో భాగమే. వారు తీసుకునే బ్రీథింగ్ లెవల్స్‌ను గమనించి కూడా ఎమోషన్ గా వాళ్లు ఏం ఫీలవుతున్నారో గుర్తించవచ్చు. తక్కువ బ్రీథ్ తీసకుంటే వారు టెన్షన్ లో ఉన్నట్లు.. అర్థం. అలాగే వారికి ఏ విషయాలు మీతో ఆ సమయంలో షేర్ చేసుకునే ఆసక్తి కూడా లేనట్లు అర్థం. (Mind reading techniques in relationship)