ఉచిత పరీక్ష మీరు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు, మీరు మీ రక్తంతో ఇతరులకు సహాయం చేస్తున్నారు. కానీ దానితో ఉచిత మినీ-హెల్త్ టెస్ట్ వస్తుంది. రక్తదానం చేసే ముందు సాధారణంగా రక్తాన్ని పరీక్షిస్తారు. మీ రక్తపోటు,హిమోగ్లోబిన్, పల్స్ పరీక్షిస్తారు. ఈ ముఖ్యమైన సమాచారం రెడ్‌క్రాస్ రక్తదాన కేంద్రాల ద్వారా వ్యక్తి ఆన్లైన్ దాత ప్రొఫైల్‌లో రికార్డ్ చేస్తారు. తద్వారా మీరు మీ ఆరోగ్య స్థితి గురించి సులభంగా తెలుసుకోవచ్చు.
ప్రాణాలను రక్షించడంలో సహాయం: రక్తదానం చేసిన తర్వాత, మీ రక్తం ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మాగా విభజించబడుతుంది. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తికి రక్తమార్పిడి లేదా సప్లిమెంట్లు అవసరం కావచ్చు. కాబట్టి ఆ సమయంలో మీ రక్తాన్ని అతని కోసం ఉపయోగించవచ్చు. మీరు మీ సమయాన్ని, రక్తాన్ని అవసరమైన వారికి విరాళంగా ఇస్తున్నారని మీరు గ్రహించినప్పుడు ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
టాక్సిసిటీని తొలగిస్తుంది: రక్తదానం చేయడం వల్ల మీ శరీరంలోని ఐరన్ పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీంతో గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రోజురోజుకు ఐరన్ తీసుకోవడం వల్ల కొందరిలో ఐరన్ లోపం మరింత తీవ్రమవుతుంది. రక్తదానం చేయడం ద్వారా, మీరు మీ ఐరన్ స్థాయిలను తగ్గించవచ్చు మరియు మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడటానికి దారితీస్తుంది..
రక్తహీనత: ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రమాదాలు, రుగ్మతల కారణంగా రక్తానికి అధిక డిమాండ్ ఉంది. కాబట్టి మనం రక్తదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత రక్తదాతల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కాబట్టి మనం ఉన్నత స్థాయిలో రక్తదానంపై అవగాహన పెంచుకోవడం ద్వారా ఈ లోటును పూడ్చుకోవాలి.