ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టి బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు ఒక చెంచా ముల్తానీ మిట్టి పొడిని తీసుకోండి. తరవాత అందులో కొద్దిగా వేప పొడి, నిమ్మరసం, రోజ్ వాటర్ మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. Image/Canva
సముద్రపు ఉప్పు: సముద్రపు ఉప్పు, తేనె కూడా మీ ముఖంలోని బ్లాక్‌హెడ్స్‌ను త్వరగా తొలగించడంలో సహాయపడతాయి. దీని కోసం సముద్రపు ఉప్పులో కొద్దిగా తేనె మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.. Image : Shtterstock
నిమ్మకాయ: బ్లాక్ హెడ్స్ తొలగించడానికి, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి. అందులో సమాన పరిమాణంలో నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని బ్లాక్‌హెడ్ ప్రాంతంలో అప్లై చేసి దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గిపోతుంది.(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)