సాధారణంగా చాలా మంది నిత్యం అనేక రకాల వంటకాలను చేసుకుని తిని ఆనందిస్తుంటారు. అయితే ఏదైనా వంట వండితే అందులో ఉప్పు లేనిదే దానికి రుచి రాదు. అందులో ముఖ్యంగా తీపి వంటకాల సంగతి పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలో అయినా సరే.. ఉప్పు తగినంత ఉండాల్సిందే. లేదంటే తిన్నా కూడా తిన్నట్లు అనిపించదు.
అయితే ఉప్పు కవాల్సినంత అంటే తగినంత తింటే మన ఆరోగ్యానికి ఏమీ కాదు. కానీ ఉప్పు మోతాదు మించితే మాత్రం మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకావం ఉది. హై బీపీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానితో పాటు గుండె జబ్బులు,కిడ్నీ సమస్యలు వస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం మనం తగినంత మోతాదు కన్నా ఎక్కువ ఉప్పు తింటే మన శరీరం మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంటుంది.
ఇక.. జనరల్‌గా ఓ వ్యక్తి రోజుకు 7.2 గ్రాముల ఉప్పు వాడుతారు. ఉప్పు ఎక్కువైతే.. హైబీపీ వస్తుంది. తక్కువైతే లోబీపీ వస్తుంది. ఎవరైనా సరే.. రోజూ 6 గ్రాముల దాకా మాత్రమే ఉప్పును వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మీరు మాటిమాటికీ యూరిన్ (ఒకటికి) వెళ్తున్నారా.. అయితే.. మీరు ఉప్పు కాస్త తగ్గించాలి. ఇలా పైన చెప్పిన విధంగా లక్షణాలు కినిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)