ఈ మధ్యకాలంలో అందరూ ఎక్కువగా హ్యాండ్ వాష్ వాడుతున్నారు. పరిశుభ్రతపై శ్రద్ధ పెరగడమే అందుకు కారణం. ఏదైనా తినాలన్నా... బయటికి వెళ్లి వచ్చినప్పుడైనా... చేతులు కడుక్కోవడం మంచిది. ఎందుకంటే మనకు తెలియని ఎన్నో సూక్ష్మక్రిములు మన చేతులపై ఉంటాయి. చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు తొలగి పోయి ఎన్నో రకాల రోగాలు రాకుండా జాగ్రత్త పడొచ్చు. కొన్ని సందర్భాల్లో హ్యాండ్ వాష్ అందుబాటులో ఉండదు.. అలాంటి సమయంలో వాటర్లో కాస్త ఉప్పువేసి చేతులను క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని నీటిని వేడిచేసి అందులో లవంగాలు వేసి మరిగించి ఆ నీటితో చేతులను క్లీన్ చేసుకోండి. లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మీ చేతులను శుభ్రం చేస్తాయి. నిమ్మచెక్కలతో బాగా రుద్దడం వల్ల కూడా చేతులు శుభ్రపడతాయి.