క్యాన్సర్స్‌కు ప్రధాన కారణాలు.. మన జీవన శైలి, అనారోగ్యమైన ఆహరం. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. అటువంటి కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిని ఎక్కువగా తినడం మానుకోవాలి. లేకపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మాంసాహారం.. అందులోనూ రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వ్యక్తులకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మటన్, బీఫ్, పోర్క్ (పంది మాంసం) వంటివి రెడ్ మీట్ కిందకు వస్తాయి. ప్రాసెస్డ్ మీట్ అంటే.. ప్యాకింగ్ చేసిన మాంసం. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు. మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే.. దానిని తగ్గించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కొందరు వ్యక్తులు మద్యానికి బానిసవుతారు. చుక్క లేనిదే రోజు గడవదు. కనీసం ఒక్క పెగ్గైనా పడాల్సిందే. ఐతే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే.. నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు, రొమ్ము, ప్యాంక్రియాటిక్ భాగాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మందు మితంగా తాగితే ఓకే. కానీ అతిగా తాగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్నాక్స్, ఫిజీ డ్రింక్స్, పంచదారతో కూడిన తృణధాన్యాలు, రెడీ-టు-ఈట్ మీల్స్, ప్యాక్డ్ బేక్డ్ గూడ్స్ మొదలైనవి కూడా రొమ్ము క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో కేలరీలు, ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ ఊబకాయానికి కారణమవుతాయి. ఆ తర్వాత కాన్సర్ వచ్చే ప్రమాదముంది. (ప్రతీకాత్మక చిత్రం)
క్యాన్సర్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే...ముందుగా ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. డైట్లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. మీ ఆహారంలో తక్కువ అనారోగ్యకరమైన కొవ్వు ఉండే, కేలరీలు అధికంగా ఉండే వాటిని చేర్చాలి. అలాగే ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ పండ్లు, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, గింజలు, పప్పులు మొదలైనవి ఎక్కువగా తినాలి. (ప్రతీకాత్మక చిత్రం)