TELUGU HEALTH TIPS DONT THROW BANANA PEELS HERE IS THE AMAZING HEALTH BENEFITS BY USING THEM SK
Banana Peel: అరటి తొక్కలను పడేయకండి.. ఇలా వాడితే అదిరిపోయే లాభాలు..
Banana peel Benefits: అరటి పండును అందరూ ఇష్టంగా తింటారు. మనలో చాలా మందికి ఉదయాన్నే పాలతో పాటు అరటి పండును తినడం అలవాటు. ఐతే మనం పండును మాత్రమే తింటాం. తొక్కను చెత్తబుట్టలో పడేస్తాం. కానీ అరటి తొక్కలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
అరటి తొక్కతో ప్రతి రోజూ ఒక నిమిషం పాటు పళ్లను రద్దండి. వారం రోజుల పాటు ఇలా చేస్తే మీ పళ్లు మిలమిలా మెరుస్తాయి. పళ్లను తెల్లగా చేయడంలో అరటి తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ముఖంపై మొటిమలను కూడా అరటి తొక్కలు తొలగిస్తాయి. అరటి తొక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై కొంతసేపు సున్నితంగా మర్దన చేయాలి. వారం పాటు ఇలా చేశారంటే మొటిమల సమస్య తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఒక గిన్నెలో గుడ్డు పచ్చ సొనను తీసుకొని అందులో అరటి తొక్క పేస్ట్‌ను వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా వేసుకోవాలి. 10 నిమిషాల ఉంచి ఆ తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు తొలగిపోతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
శరీరంపై ఎక్కడైనా నొప్పిగా ఉంటే అక్కడ అరటి తొక్కను ఉంచాలి. సుమారు 30 నిమిషాల పాటు ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
దోమలు కరిచినా లేదా ఇతర కీటకాలు కుట్టినా.. అక్కడ కొంత నొప్పి, దురద ఉంటుంది. అలాంటప్పుడు అరటి తొక్కతో కాసేపు రుద్దాలి. నొప్పి మాయం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
అరటి తొక్కలను షూ పాలిష్‌గా కూడా వాడవచ్చు. వెండి వస్తువులను కూడా తోమవచ్చు. అరటి తొక్కలతో రుద్దితే షూలు, లెదర్ , వెండి వస్తువులు తళతళా మెరుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అరటి తొక్కలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)