Teachers Day 2021: ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది గురువులు, తల్లిదండ్రులే. వారి నుంచి మంచి విషయాలు నేర్చుకునే విద్యార్థులు రేపు భావిభారత పౌరులు అవుతారు. మరి అలాంటి టీచర్లను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నాడు పూజించుకోవడం మన సంప్రదాయం. మరి ఈ సంవత్సరం కూడా వారికి శుభాకాంక్షలు చెబుతూ... టీచర్లు వాడుకునేందుకు అత్యంత వీలుగా ఉండే యాప్స్ (Google Apps) ఏవి ఉన్నాయో చూద్దాం. (image credit - google play story)
Teacher App: ఇది టీచర్లకు లైవ్ టీచింగ్ యాప్. ఇది ఆల్-ఇన్-వన్ ఫ్రీ యాప్. దీన్ని టీచర్లు, ట్యూటర్లు, కోచింగ్ ఇన్స్టి్ట్యూట్లు వాడుకోవచ్చు. దీని ద్వారా టీచర్లు యోగా, డాన్స్, ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ చెయ్యాలి, ఏదైనా సబ్జెక్ట్ ఎలా చెప్పాలి వంటివన్నీ తెలుసుకోవచ్చు. వీడియోలు రికార్డ్ చెయ్యవచ్చు, టెస్టులు పెట్టవచ్చు, నోట్స్ షేర్ చెయ్యవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. (image credit - google play story)
Teachmint: ఇదో ఫ్రీ లైవ్ టీచింగ్ యాప్. దీని ద్వారా ఆన్లైన్లో పాఠాలు బోధించవచ్చు. ఇది ఇండియాలో అతి పెద్ద ఆల్-ఇన్-వన్ యాప్‌గా చెబుతున్నారు. ఇందులో లైవ్ ఆన్లైన్ క్లాసులు, లెక్చర్ రికార్డింగ్స్, రియల్ టైమ్ నోట్స్ షేరింగ్, వైట్ బోర్డ్ ఫంక్షనాలిటీ, ఆన్లైన్ టెస్టులు, చాట్స్, అనౌన్స్మెంట్స్ వంటి ఫీచర్లున్నాయి. (image credit - google play story)
School Teacher App: ఈ యాప్ ద్వారా స్కూల్ పిల్లలకు టీచర్లు ఎప్పుడూ టచ్‌లో ఉండొచ్చు. వారి అటెండెన్స్, అకడమిక్ పెర్ఫార్మెన్స తెలుసుకోవచ్చు. ఇందులో సర్క్యులర్లు, ఈవెంట్స్, టైమ్ టేబుల్, పోర్షన్ వంటివి అప్లోడ్ చెయ్యవచ్చు. వాటిని విద్యార్థులకు పంపవచ్చు. విద్యార్థులందరి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇందులో సెట్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా చెయ్యవచ్చు. (image credit - google play story)
Teacher Simulator: ఇదో ప్రత్యేకమైన యాప్. ఇదో గేమ్ లాంటిది. ఇది ఆడుతుంటే... టీచర్ ఎలా లెసన్స్ చెప్పాలి, ఎలా విద్యార్థులతో కనెక్ట్ అవ్వాలి, పిల్లలు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇవ్వాలి వంటివి ఉంటాయి. బెస్ట్ టీచర్ అవ్వడానికి ఏమేం చెయ్యాలో అన్నీ ఆట రూపంలో ఇందులో ఉంటాయి. (image credit - google play story)
ClassDojo: ఇది క్లాస్రూమ్ కమ్యూనిటీ యాప్. ఇందులో టీచర్లు, పేరెంట్స్, స్టూడెంట్స్ ఉంటారు. టీమ్ వర్క్ చెయ్యడానికి ఇది బాగా పనికొస్తుంది. టీచర్లు అటు పిల్లలు, ఇటు వారి పేరెంట్స్‌తో కనెక్ట్ అవుతూ... ఈ కరోనా సమయంలో అన్ని పనులూ చక్కబెట్టవచ్చు. స్టూడెంట్స్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా చెయ్యవచ్చు. (image credit - google play story)
ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే... ఆటోమేటిక్‌గా ఇన్స్టాల్ అవుతాయి. అయిన తర్వాత వీటిని ఉపయోగించవచ్చు. వీటిలో కొన్ని యాప్స్‌లో యాడ్స్ వస్తుంటాయి. అయినప్పటికీ వీటి వల్ల ప్రయోజనాలు ఉండటంతో... చాలా మంది టీచర్లు వీటిని వాడుతున్నారు. (image credit - google play story)