చలికాలంలో ఆస్తమాతో బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఈ సీజన్లో సాధారణంగానే జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో పాటు ముక్కు బ్లాక్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆస్తమా బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ఈ సీజన్లో ఆస్తమా పేషెంట్లు ఊపిరి తీసుకోవడానికి మరింత ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్య ఉన్నవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.. లేదంటే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.(ప్రతీకాత్మక చిత్రం)
శరీరంలో ఊపిరితిత్తులకు ముక్కు, గొంతులో ఉన్న గొట్టాల ద్వారా గాలి లోపలికి వెళ్తుంది. చలికాలంలో ఈ గొట్టాల్లో శ్లేష్మం ఎక్కువగా జమ అవుతుంది. గొట్టాల ద్వారా గాలి వెళ్లే ప్రదేశం మరింత సన్నగా అయిపోతుంది. దీనివల్ల పీల్చుకున్న మొత్తం గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. ఆస్తమా ఉన్నవారికి ఇది మరింత డేంజర్. అయితే ఈ కింది నిబంధనలు పాటిస్తే చలికాలంలో ఆస్తమా బాధితులు ధైర్యంగా ఉండవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
నీళ్లలో ఎక్కువగా ఉండవద్దు : ఆస్తమా ఉన్నవారు చలికాలంలో సాధ్యమైనంత వరకు నీటికి దూరంగా ఉండాలి. సాధారణంగా నీరు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే చలికాలంలో దానిని తగ్గించుకోవాలి. గోరువెచ్చని నీటినే తాగాలి. లేదంటే జలుబు వచ్చి ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంది. జలుబు వస్తే గొంతులో, ముక్కులో కఫం నిండిపోతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటి దగ్గరే వ్యాయామం : చలికాలంలో ఉదయం బయట వాతావరణం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. లాంటి ప్రదేశాల్లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. బయట కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆస్తమా పేషెంట్లు మంచు, కాలుష్యం నిండిన గాలిని పీల్చడం చాలా డేంజర్. కాబట్టి వాకింగ్ అయినా జాగింగ్ అయినా ఈ సీజన్లో ఇంట్లోనే చేయండి. ఒకే ప్రదేశంలో ఉండి కూడా జాగింగ్, స్ట్రెచింగ్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
వెచ్చగా ఉండే దుస్తులు : జనవరిలో చలి పీక్స్‌లో ఉంటుంది. ఇంట్లో కూర్చున్నా బయట ఉన్నట్టే ఉంటుంది. అందుకే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ఆస్తమా పేషెంట్లకు చాలా అవసరం. ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎప్పుడూ స్వెటర్స్, గ్లోవ్స్ వేసుకొని ఉండాలి. చెవి, ముక్కు, నోటిని స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
నోటి ద్వారా మాత్రమే ఊపిరి తీసుకోవాలి : చలికాలంలో నోటి ద్వారా ఊపిరి తీసుకుంటే బయట ఉన్న కలుషితమైన గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది ఇంకా ప్రమాదం. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకోవాలి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకుంటే అది ఫిల్టర్ అయి వెచ్చగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అవసరమైతే బాధితులు నోరు, ముక్కును కవర్ చేసే మాస్క్ లేదా స్కార్ఫ్ ధరించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
పెంపుడు జంతువులకు దూరంగా : ఆస్తమా ఉన్నవారు తమ ఇంట్లో పెంపుడు జంతువులను గనుక పెంచుకుంటూ ఉంటే వాటికి కొంత కాలం పాటు దూరంగా ఉండండి. చలికాలంలో వాటికి రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆ సమయంలో వాటి వ్యాధులు ఆస్తమా ఉన్నవారికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. సాధ్యమైనంత వరకు చలికాలంలో పెంపుడు జంతువులను బయట ఉంచడమే ఉత్తమం.(ప్రతీకాత్మక చిత్రం)