మొటిమలు అలాగే యాక్నే సమస్యతో మీరు దిగులుపడుతున్నారా? ఈ అరటిపండు ప్యాక్‌తో యాక్నే స్కార్స్తో పాటు బ్లాక్ స్పాట్స్ తొలగిపోతాయి. ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. ఆ తరువాత వాటిని మ్యాష్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనెను అలాగే ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. Image source Pexels
చర్మంతో పాటు జుట్టుకు సైతం అరటి మేలు చేస్తుంది. వారంలో ఒక రోజు బాగా మగ్గిన అరటిపండు గుజ్జులో ఒక టీ స్పూను పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మాడు నుండి జుట్టు చివర్ల వరకు రాసుకోవాలి. అరగంట తర్వాత హెడ్‌బాత్ చేయాలి. ఇలా చేయటం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటంతో పాటు తగిన పోషణ అందుతుంది. Image source Pexels