SUMMER TIPS ARE YOU GETTING TOO MUCH SWEATING HERE IS HOME REMEDIES FOR LESS SWEAT SK
Summer Tips: వేసవిలో చెమట మరీ ఎక్కువగా పడుతోందా? దుస్తులు తడిచిపోతున్నాయా? ఇలా చేయండి
Summer Tips: ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ సమయంలో ఎవరికైనా చెమట పడుతుంది. కానీ కొందరి మాత్రం విపరీతంగా చెమట పడుతుంది. ఆ చెమటతో బట్టలు కూడా తడిసిపోతాయి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
వేసవిలో చెమట పట్టడం సాధారణమైన విషయమే. కానీ మరీ ఎక్కువగా పడితే..చికాకుగా ఉంటుంది. మరి వేసవిలో అధిక చెమట సమస్యలకు ఎలా చెక్ పెట్టాలి? ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది? చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు.
2/ 7
ఒక గ్లాస్ నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి... దానితో గొంతు, చంకలు, చేతులు, అరికాళ్లకు మర్దన చేయాలి. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరానికి ఎక్కువ చెమట పట్టదు.
3/ 7
టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తాయి. ఒక వారం రోజు ప్రతి రోజు గ్లాస్ టమాటా రసం తాగాలి.
4/ 7
ఆహారం మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. వేసవిలో ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరం నుంచి ఎక్కువ నీరు బయటకు వెళ్తుంది. అందుకే ఎక్కువగా చెమట వస్తుంది.
5/ 7
ఉప్పు ఎక్కువగా తిన్న చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వేసవిలో ఉప్పును మరిమితంగానే తీసుకోవాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది.
6/ 7
అధిక ఒత్తిడి, ఆతురత, టెన్షన్ ఎక్కువగా ఉన్నా... చెమట అధికంగా వస్తుంది. అందుకే ప్రతి రోజు ధ్యానం చేయాలి. శ్వాస ఎక్సర్సైజ్లు చేయడం ద్వారానూ చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చు.
7/ 7
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.) (ప్రతీకాత్మక చిత్రం)