ఓవైపు కరోనా... మరోవైపు ఎండలు... ప్రాణాలు తోడేస్తున్నాయి. ఎండాకాలంలో ఎండ వల్ల గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గిపోయి... కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువవుతుంది. దాని వల్ల మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ మన బ్రెయిన్‌కి సరిపోదు. దాంతో మెదడులో కణాలు హీట్ అవుతాయి. దాంతో తలనొప్పి మొదలవుతుంది. అది హీట్ స్ట్రెస్‌గా మారుతుంది. మొదట్లో అప్పుడప్పుడూ వచ్చే దీన్ని వెంటనే తగ్గించుకోకపోతే... ఇక రెగ్యులర్‌గా వచ్చేస్తూ... తీవ్ర అనారోగ్యాల పాలయ్యేలా చేస్తుంది.
బయటి వాతావరణం 35 డిగ్రీలు దాటితే మనుషులు తట్టుకోలేరు. పైకి తట్టుకున్నట్లు కనిపిస్తారు కానీ లోలోపల చాలా అనర్థాలు జరిగిపోతూ ఉంటాయి. ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరగానే మన శరీరం దాన్ని తట్టుకోవాలని ప్రయత్నిస్తూ చెమటను రిలీజ్ చేస్తుంది. దాని వల్ల శరీర చర్మం చల్లగా మారుతుంది. ఐతే... బాడీలో నీరు బయటకు వచ్చేయడంతో... డీ-హైడ్రేషన్ సమస్య వస్తుంది. ఎప్పుడైతే నీరు బాడీలో లేదో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. లేదా తలనొప్పి మొదలవుతుంది.
వీలైనంతవరకూ ఉదయం 11 గంటల తర్వాతా సాయంత్రం 3లోపు ఇంట్లోంచీ లేదా ఆఫీసు లోంచీ బయటకు వెళ్లకపోవడం మేలు. ఈ సమయంలో బయట తిరిగితే... ఆ వేడికి... కచ్చితంగా హీట్ స్ట్రెస్ ఏర్పడుతుంది. తప్పనిసరై వెళ్లాల్సి వస్తే గొడుకు, టోపీ లాంటివి వాడాలి. హీట్ స్ట్రెస్ వచ్చినప్పుడు తల లోపల బండరాయిని పెట్టినట్లు బలంగా బరువుగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి మందులు వాడటం కంటే... నిద్రపోవడం బెస్ట్ ఆప్షన్.
హీట్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం తిన్నా అరగదు. ఒక్కోసారి వామ్టింగ్స్ (వాంతులు) కూడా అవుతాయి. ఆ బండరాయి లాంటి తలనొప్పి తగ్గితేనే మనం ఆల్ రైట్ అవుతాం. సో దాన్ని రాకుండా చూసుకోవడం బెస్ట్. ఎండలోకి వెళ్లకపోయినా... గాలిలేని చోట... గంటల తరబడి కూర్చున్నా ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే గాలి లేని చోట... కార్బన్ డై ఆక్సైడ్ పెరిగి... ఆక్సిజన్ తగ్గిపోయి... ఇది మొదలవుతుంది. కాబట్టి... మీరు కూర్చునే చోట... గాలి అటూ ఇటూ కదిలేలా చేసుకోండి. మాటిమాటికీ నీరు తాగండి.
కరోనా కారణంగా గుంపుల్లోకి వెళ్లకూడదని మనకు తెలుసు. ఐతే... హీట్ స్ట్రెస్ బారిన పడకుండా ఉండాలంటే కూడా జనం ఎక్కువగా ఉన్న చోటికి వెళ్లకూడదు. కార్యక్రమాలు, పార్టీలకు దూరంగా ఉంటే... మంచి గాలి లభిస్తుంది. బెస్ట్ ఏంటంటే... మొక్కలు, చెట్లు ఉన్న చోట ఎక్కువగా తిరగాలి. తద్వారా మంచి ఆక్సిజన్ లభించి... మెదడులో కణాలు చురుకుగా మారి... కొత్త కణాలు పుట్టి... తెలివితేటలు పెరుగుతాయి. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)