పీచ్ ఫ్రూట్ ...షుగర్ లెవల్ ని కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది. దీనిలో పీచు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. 100 గ్రాముల పీచ్ లో 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పీచు ఒక కొండ పండు, ఇది నిర్దిష్ట సీజన్లో మాత్రమే లభిస్తుంది. ఎక్కువగా వాయవ్య చైనాలో పండుతుంటాయి. ఇవి స్టోన్ ఫ్రూట్ జాతికి చెందినవి. అంటే... వీటి మధ్యలో ఒకటే గింజ ఉంటుంది. చెర్రీస్, రికాట్స్, ప్లమ్స్, నెక్టారిన్స్ ఇలాంటివే. పీచ్ పండ్లలోపలి పదార్థం తెలుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది
కివిలో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఒక కివిలో 215 మిల్లీగ్రాముల పొటాషియం, 64 మిల్లీగ్రాముల విటమిన్ C, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. కివీలో 42 కేలరీలు, 10 గ్రాముల కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. అందుకే దీనిని పవర్‌హౌస్ ఫ్రూట్ అని కూడా అంటారు. కివి సంవత్సరం పొడవునా లభించే పండు. కివిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్ ని నియంత్రించడంలో సహాయపడతాయి.