టాలీవుడ్ సెలబ్రిటీలను కట్టిపడేస్తున్న నీరజా కోనా కాస్ట్యూమ్స్

నీరజా కోనా టాలీవుడ్ స్టైలిస్ట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్. చాలామంది టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. 2013లో జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌ సినిమా బాద్షాకి తొలిసారి ఆమె డిజైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత హీరో నితిన్ సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. నెక్ట్స్ హీరోయిన్ సమంతాకు పర్సనల్ స్టైలిస్ట్ అయిపోయారు. అత్తారింటికి దారేదీ, రామయ్య వస్తావయ్యా సినిమాల్లో కాస్ట్యూమ్స్ ఇచ్చి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. నీరజా కోనా క్రియేటివ్ వర్క్స్ మీకోసం.