మన మంతా పొద్దస్తమానం కష్టపడేది ఎందుకు? మన అభివృద్ధి కోసమే కదా. మన కోసం మన వాళ్ల కోసం కష్టపడతాం. ఐతే... ఈ కష్టంలో పడి... మన ఆరోగ్యాన్ని పాడుచేసుకోకూడదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే... మన ఇల్లు, మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి... ఉద్యోగాలు చేసే వారు, పనుల్లో బిజీగా ఉండేవారు... కొన్ని ప్రత్యేక అలవాట్లను కలిగి ఉండాలి. రొటీన్ లైఫ్‌స్టైల్‌కి కాస్త భిన్నంగా ఉండాల్సి ఉంటుంది. మొదట్లో ఇది కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కానీ దీన్ని అభిరుచిగా మార్చుకుంటే... జీవితం హాయిగా ఉంటుంది. అంతేకాదు... మీ పనితీరు కూడా చాలా మెరుగవుతుంది. అందుకే ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం.
NEVER SKIP BREAKFAST: రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఏదో తరుముకొస్తున్నట్లు కాకుండా... ఆ బ్రేక్ ఫాస్ట్ రుచులను గ్రహిస్తూ... కాస్త ఫీలవుతూ తినండి. రాత్రివేళ లేటుగా తిన్నానంటూ... చాలా మంది ఉదయం వేళ తినరు. అలా చెయ్యవద్దు. కావాలంటే రాత్రివేళ 7 తర్వాత తినడం మానేస్తే బెటర్. అప్పుడు ఉదయం బాగా హెవీగా తినవచ్చు. బ్రేక్ ఫాస్టులో ఫ్రూట్స్, ధాన్యాలు, కూరగాయలు, నట్స్, గింజలు, ఫైబర్ , మిల్క్, పెరుగు ఇలా వీలైనన్ని రకాలు ఉండేలా చేసుకోండి.
KEEP A WATER BOTTLE ALONG: వీలైనంత ఎక్కువ నీరు తాగితే... మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడూ ఓ వాటర్ బాటిల్ నీరు ఎదురుగానే పెట్టుకోవాలి. వీలైనప్పుడల్లా వాటర్ తాగాలి. దాహం వెయ్యకపోయినా తాగాల్సిన పనిలేదు. కాకపోతే... అసలు తాగకుండా ఉండకూడదు. ఆ బాటిల్ కూడా రాగి (కాపర్) బాటిల్ అయితే చాలా మంచిది. ఆ నీటిలో పుదీనా ఆకులు, నిమ్మరసం, దోసకాయ ముక్కలు, యాపిల్ ముక్కల వంటివి ఉంటే ఇంకా మేలు.
REPLACE SNACKS WITH FRUITS: స్నాక్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఎందుకంటే స్నాక్స్‌లో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి. వాటి బదులు ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. రకరకాల ఫ్రూట్స్ ఈ ప్రపంచంలో ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అలాంటివి యాడ్ చేసుకుంటే చక్కటి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. జంక్ ఫుడ్‌కి ఎంత దూరం జరిగితే అంత ఆరోగ్యానికి దగ్గర జరిగినట్లు.
SWITCH TO HEALTHY CAFFEINE: పనిలో తలనొప్పి వస్తోందా? టెన్షన్ పెరుగుతోందా? అలసిపోయినట్లు అనిపిస్తోందా? ఇలా అనిపించేవారు జనరల్‌గా కాఫీయో, కూల్ డ్రింకో తాగేస్తారు. ఎందుకంటే వాటిలో కెపైన్, పంచదార... వారికి వెంటనే ఎనర్జీ తెస్తాయి. కానీ... ఇలా రోజులు గడిచే కొద్దీ... ఈ కెఫైన్, షుగర్ అనేవి విషంలా పనిచేసి... సహజసిద్ధమైన ఎనర్జీని లేకుండా చేస్తాయి. అందుకే వాటి బదులు గ్రీన్ టీ తాగడం మేలు. ఇప్పుడు గ్రీన్ టీలలో దాదాపు 20 రకాలున్నాయి. ఒక్కోసారి ఒక్కో రకం టేస్ట్ చూసినా తృప్తిగానే ఉంటుంది.