మహాత్మా గాంధీకి స్మారక చిహ్నంగా దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతం బాపూని దహనం చేసిన ప్రదేశం. మీరు ఢిల్లీకి వెళితే తప్పకుండా సందర్శించిన ప్రదేశం. ఇది ఢిల్లీ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మహాత్మా గాంధీ మార్గ్ రోడ్డులో ఈ ఘాట్‌ను ఏర్పాటు చేశారు.
చిరునామా.. ఎర్రకోటకు వెనుక ప్రదేశంలో ఉంటుంది. న్యూఢిల్లీ– 110006.
ఇది జవహర్లాల్ నెహ్రూ మార్గ్‌లో ఉంది. ఈ మ్యూజియంలోని లైబ్రరీలో అద్భుతమైన పుస్తక సంపద అందుబాటులో ఉంటుంది. అంతేకాదు జర్నల్స్, పోటోగ్రాఫ్స్, ఎగ్జిబీషన్, ఆర్ట్ ఇవన్ని ఆ మహీత్ముడు ఆయన సతీమణి కస్తూర్ బా కు చెందినవి ఎక్కువగా ఉన్నవి. మీరు ఎవైనా పరిశోధనలు చేయాలనుకుంటే.. గాంధీకి సంబంధించిన సమాచారంతోపాటు ఆడియో విజువల్స్ కూడా ఈ మ్యూజియంలో పొందుపరిచారు.
అడ్రస్.. జవహర్లాల్ నెహ్రూ మార్గ్, రాజ్‌ఘాట్‌కు ఎదురుగా,విక్రం నగర్, న్యూఢిల్లీ –110002.
గాంధీ స్మృతిని గతంలో బిర్లా హౌస్ లేదా బీర్లా భవన్‌గా పిలిచేవారు. ఈ అందమైన మ్యూజియాన్ని మహాత్ముడికి అంకితం చేశారే. ఈ మ్యూజియం ఉన్న ప్రదేశంలోనే గాంధీ తన చివరి 144 రోజులు గడిపారు. 1948 జనవరి 30న మరణించారు. ఆ ప్రాంతంలో 1973 ఆగస్టు 15న గాంధీ స్మృతిని ప్రారంభించారు. ఇక్కడ బాపు జీవితానికి సంబంధించిన అనేక సమాచారం లిఖితపూర్వకంగా అందుబాటులో ఉంటుంది.
అడ్రస్.. నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌కు ముందు ప్రాంతంలో,5, టీస్ జనవరి మార్గ్, బిర్లా హౌస్, డిల్లీ–110001.
1946లో మహాత్మా గాంధీ గోలే మార్కెట్లోని హరిజన్ బస్తీలో కొంతకాలం ఉన్నట్లు చాలా తక్కువ మందికి తెలుసు. వాల్మికి మందిర్ కంపౌండ్‌లోనే బాపూ ఆశ్రమమం ఉంది. ఆ ప్రాంతంలో నివాసించే అనేక మంది పిల్లలకు గాంధీ హిందీ, ఇంగ్లిష్ నేర్పించేవాడు. ఇక్కడ బాపూజీకి సంబంధించిన అనేక ఫోటోలతోపాటు, సర్దార్ వల్లా భాయ్ పటేల్, మహ్మద్ అలీ జిన్నా, ఇతర ప్రముఖ నేతల చిత్ర పటాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో గాంధీని వీరంతా కలిశారు. దాదాపు ఓ 214 రోజులపాటు ఇక్కడ ఉన్నారు. 1946 ఏప్రిల్ 1 నుంచి 1947 జూన్ 10 వరకు.
అడ్రస్.. జే6ఆర్3+74 క్యూ, హరిజన్ బస్తీ, గోలే మార్కెట్, న్యూ ఢిల్లీ–110001