భారతీయులు ఆహార ప్రియులు. ఆహారపదార్థాలు, పానీయాలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు. మన దేశంలో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒక్కో చోట ఒక్కో వెరైటీ ఉంటుంది. మన స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్ అదంటే.. విదేశాల్లో కూడా ఇవి దొరుకుతాయి. అలాంటి వంటకాలు చాలానే ఉన్నాయి. కానీ వాటి పేరేంటో చాలా మందికి తెలియదు. హిందీ లేదా స్థానిక భాషలోనే పిలుస్తుంటారు. కానీ వాస్తవానికి అవి కరెక్టు కాదు. అందుకే మనదేశంలో ఎంతో ఫేమస్ అయిన వంటకాల పేర్లను ఇంగ్లీష్‌లో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
రైతా (Raita): దీనిని పెరుగుతో తయారు చేస్తారు. ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి. బూందీ రైతా, వెజ్ రైతా, ఫ్రూట్ రైతా ఇలా ఎన్నో రకాలు చేసుకుంటారు. ఐతే మరి రైతాను ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసా? ఇంగ్లీష్‌లో రైతాను మిక్స్డ్ కర్డ్ అంటారు. పెరుగులో పలు పదార్థాలను కలిపి వీటిని చేస్తారు.. అందుకే మిక్స్డ్ కర్డ్ అని పిలుస్తారు.