Weight Loss : కోడిగుడ్లు, వేరుశనగ తింటే బరువు పెరగొచ్చు. అదే తగ్గాలంటే మాత్రం పెద్ద సమస్యే. ఇప్పుడు భారతీయుల్లో ఎక్కువ మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే ఇండియాలో డయాబెటిస్, హార్ట్ ఎటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి. టీవీ నటి, బ్రెస్ట్ క్యాన్సర్ని జయించిన చవి మిట్టల్ (Chhavi Mittal) తాజాగా యూట్యూబ్ ద్వారా తాను ఎలా బరువు తగ్గిందీ తెలిపింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. (image credit - instagram - chhavihussein)
నిద్ర : బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా నిద్రపై ఫోకస్ పెట్టాలని చవి చెబుతోంది. ఎవరైతే బాగా నిద్రపోతారో.. వారు త్వరగా బరువు తగ్గుతారని అంటోంది. నిద్ర పోకుండా.. ఎన్ని వ్యాయామాలు చేసినా వేస్టే అంటోంది. బాగా నిద్రపోతేనే.. శరీరం వెడెక్కి కొవ్వు కరుగుతుందనీ.. తద్వారా బరువు తగ్గుతారని వివరిస్తోంది. (image credit - instagram - chhavihussein)
ఒత్తిడి : బరువు పెరగడానికి ఒత్తిడి ఒక కారణం అంటున్న చవి.. ఒత్తిడి వల్ల మన శరీరంలో కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతుందనీ.. దాంతో.. శరీరం కొవ్వును కరిగించడం మానేసి, జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుందని అంటోంది. కాబట్టి.. టెన్షన్ లేకుండా చూసుకోవడం రెండో చిట్కా. (image credit - instagram - chhavihussein)
కేలరీల కౌంట్ : కేలరీల లెక్కలు వేసుకుంటూ ఆహారం తినవద్దని చవి చెబుతోంది. 100 గ్రాముల యాపిల్లో 52 కేలరీలు ఉంటాయి. ఇలా ప్రతీ దానికీ కేలరీల లెక్క ఉంటుంది. ఆ లెక్కలు చూసుకుంటూ.. తినడం కంటే.. ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తగ్గించి.. తక్కువ కేలరీలు ఉండే ఆకుకూరల వంటివి ఎక్కువ తినాలని చవి చెబుతోంది. (image credit - instagram - chhavihussein)
ఎక్సర్సైజ్ : రోజూ ఎంతో కొంత ఎక్సర్సైజ్ తప్పక చెయ్యాలని చవి చెబుతోంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి.. కావాల్సిన హార్మోనులు రిలీజ్ అయ్యి.. బాడీ మెటబాలిజం రేటు పెరుగుతుందని అంటోంది. ఇవీ ఆమె చెప్పిన చిట్కాలు. వీటిని పాటించి ఆమె బాగానే బరువు తగ్గింది. ఇవన్నీ తేలికైనవే. పాటించాలా లేదా అనేది ఎవరిష్టం వారిది. (image credit - instagram - chhavihussein)