జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. కేలరీలను, ఫ్యాట్నూ తగ్గిస్తుంది. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని, అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ నిమ్మ రసం కలపాలి. ఎక్సర్సైజ్ చెయ్యడానికి వెళ్లేముందుగానీ, లేదా వర్కవుట్ పూర్తైన తర్వాత గానీ... ఈ జ్యూస్ తాగాలి. రోజూ ఇలా చేస్తే, మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు మీకు అనిపిస్తుంది. జిమ్‌లో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మీ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది.
ఫ్రెష్‌గా ఉన్న అలోవెరా ఆకు తీసుకొని... దాన్ని కత్తితో కోసి... అందులో గుజ్జును వేరు చెయ్యాలి. మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్‌ని ఓ గ్లాస్ తీసుకోవాలి. అందులో ఓ టేబుల్ స్పూన్ అలోవెరా జ్యూస్‌ను కలపాలి. అది తాగేస్తే... శరీరంలో చెడు వ్యర్థాలన్నీ పరారవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతాం.
లేత పాలకూర ఆకులు కొన్ని తీసుకోవాలి. వాటిలో ఓ కప్పు అలోవెరా జ్యూస్ కలపాలి. పావు కప్పు నీరు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వేసి... మిక్సీలో బ్లెండింగ్ చెయ్యాలి. అది చక్కటి గుజ్జులా, జ్యూస్‌లా మారుతుంది. జిమ్‌కి వెళ్లేముందు ఈ స్మూతీని తాగేస్తే... ఎంతో ఎనర్జీతో వర్కవుట్ చెయ్యవచ్చు. దీని వల్ల పాలకూరలో పోషకాలు కూడా మీకు లభిస్తాయి.