ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ (Electronic Gadgets)ను ఎక్కువ సేపు ఉపయోగించకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. వీటితో ఉపయోగాలకు మించిన దుష్ప్రభావాలు ఉంటాయని చాలా అధ్యయనాల్లో తేలింది. అందుకే అవసరం మేరకే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను వాడటం మంచిదని వైద్య నిపుణులు సలహా ఇస్తుంటారు. లేకపోతే భవిష్యత్తులో వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చింది మరో అధ్యయనం. ఆ వివరాలు చూద్దాం.
* సెన్సరీ న్యూరాన్స్పై బ్లూ లైట్ ప్రభావం : దీనికి సంబంధించి స్టడీ కో ఆథర్, యూఎస్‌లోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన జాడ్విగా గిబుల్టోవిచ్ మాట్లాడారు. ‘ప్రతిరోజూ ఉపయోగించే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల వంటి డివైజ్‌ల నుంచి అధిక బ్లూ లైట్ వస్తుంది. చర్మం, ఫ్యాట్ సెల్స్, సెన్సరీ న్యూరాన్స్పై ఈ బ్లూ లైట్ ప్రభావం చూపిస్తుంది.
* అకాల మరణానికి కారణాలు ఇవే : బ్లూ లైట్ తీవ్రతకు గురైన ఫ్లై హెడ్స్ కణాలలో రీసెర్చర్స్ కొలిచిన జీవక్రియల స్థాయిలలో చాలా తేడాలు కనిపించాయి. ముఖ్యంగా మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరిగినట్లు వారు కనుగొన్నారు. కానీ గ్లూటామేట్ స్థాయిలు తగ్గాయి. రీసెర్చర్స్ నమోదు చేసిన మార్పులు.. కణాలు సబ్ ఆప్టిమల్ లెవల్లో పనిచేస్తున్నాయని సూచిస్తున్నాయి. ఇది ఫ్రూట్ ఫ్లైస్ అకాల మరణానికి కారణం కావచ్చు. అందుకే బ్లూ లైట్ ఏజింగ్ ప్రాసెస్‌ను వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు.