శృంగారం అనేది జీవితంలో ఒక భాగం. ప్రాణమున్న ప్రతి జీవికి ఇది ప్రకృతి ఇచ్చిన వరం. అయితే అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు అంతరిక్షంలో సెక్స్‌లో పాల్గొనలేదు. ఇప్పటికే వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలో అడుగుపెట్టడం, క్షేమంగా భూమికి తిరిగిరావడంతో సాధారణ ప్రజలకు అక్కడి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్పేస్ టూరిజం పేరుతో కొంత మంది పర్యాటకులను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపడానికి స్పేస్ ఎక్స్ అనే సంస్థ సిద్ధమవుతోంది. అయితే అందులో హనీమూన్ జంటలు కూడా వెళ్లడం కామన్. మరి వారు అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తింది.
అయితే సెక్స్ చేయాలంటే మొదట కావాల్సింది...ఏకాంతం. ఒక వేళ స్పేస్ ఎక్స్ పర్యాటకుల్ని చంద్రుడి మీదికి పంపితే.. వారితో పాటు ఒక నిపుణుడైన వ్యోమగామి కూడా వెళ్తాడు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య సెక్స్ ఎలా కుదరడం కష్టమని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ శృంగారానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ జాన్ మిల్లిస్ చెప్పారు. స్పెస్‌లో జీరో బరువుతో తేలియాడుతుంటారు కాబట్టి ఇద్దరు దగ్గర కావడం అన్నది సాధ్యం కాదు.