ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో పోరాడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా చాలా మందికి కంటి నిండా నిద్ర ఉండడం లేదు. బాగా నిద్రపోవాలని ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టదు. అందుకే చాలా మంది రాత్రి రెండు మూడింటి వరకు ఫోన్లు, టీవీలు చూస్తూనే గడుపుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
రాత్రి ఆలస్యంగా నిద్రపోతే.. మీకు తగినంతగా నిద్ర ఉండదు. మళ్లీ ఉదయాన్నే మేల్కోవాల్సి ఉంటుంది. తద్వారా మీరు రోజంతా ఫ్రెష్‌గా ఉండలేరు. చికాకుగా ఉంటుంది. అందుకే కొందరు స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి రాత్రిళ్లు గాఢంగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి? (ప్రతీకాత్మక చిత్రం)
మీరు రాత్రిపూట గాఢంగా నిద్రపోవాలనుకుంటే... ప్రతిరోజూ ధ్యానం చేయడం ప్రారంభించాలి. నిశ్శబ్ధంగా ఉండే.. ఏకాంత ప్రదేశంలో కూర్చొని.. 15-20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం మీ మనస్సుకు విశ్రాంతినిస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు నుంచి ప్రతికూల, పనికిరాని ఆలోచనలను తొలగించడానికి సహాయపడుతుంది. ఎవరికైనా నిద్రలేమి సమస్య ఉంటే.. నిత్యం ధ్యానం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
నిద్రలేమి సమస్యను అధిగమించడానికి లావెండర్ ఆయిల్ ఏళ్లును ఉపయోగిస్తున్నారు. ఈ నూనె మనస్సుకు ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. రాత్రి పూట దిండు కింద ఈ ఆయిల్ సాచెట్ పెట్టుకున్నా పర్లేదు. మీ రుమాలుపై రెండు మూడు చుక్కల లావెండర్ నూనెను స్ప్రే చేసుకొని.. అప్పుడప్పుడూ వాసనను పీల్చుతుండాలి. నీటిలో కొన్ని చుక్కలను వేసి..స్నానం చేసినా.. రాత్రి బాగా నిద్రపోతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఆహారంలో మెగ్నీషియం చేర్చుకోండి. శరీరంలో మెగ్నీషియం లోపం ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఇది కండరాలను సడలించ కలిగే సహజంగా లభించే ఖనిజం. తద్వారా మీకు మంచి నిద్ర వస్తుంది. గోధుమలు, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, పెరుగు, అవకాడో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. రోజుకు కనీసం 400 mg పొటాషియం తీసుకుంటే రాత్రిళ్లు నిద్ర బాగా పడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
మెలటోనిన్ సప్లిమెంట్స్ తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. మెలటోనిన్ నిద్ర నాణ్యతను బాగా పెంచుతుంది. త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. బాదం పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు మెలటోనిన్‌ను తయారు చేయడానికి దోహదపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని బాదం పాలు తాగడం వల్ల నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. చక్కగా నిద్రపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నిద్ర బాగా పట్టేందుకు.. ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. కెఫీన్, మద్యం, ధూమపానం వంటి వాటిని బాగా తగ్గించాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీరు పడుకునే గదిలో వాతావరణం ఆహ్లాదకంగా... శరీరానికి, మనసుకు ప్రశాంతత ఇచ్చే విధంగా ఉండాలి. ఈ టిప్స్ పాటిస్తే రాత్రిళ్లు బాగా నిద్రపట్టి.. ఉదయం బాగా యాక్టివ్‌గా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)