బయట దొరికే ప్రొడక్ట్స్ ల వాడకం తగ్గించి ఇంటిలోనే తయారుచేసుకుని సహజసిద్ధమైన పద్ధతులను (Beauty tips) వాడడం మంచిది అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అందమైన చర్మ సౌందర్యం కోసం చింతపండు ఫేస్ వాష్ (Tamarind Face Wash) లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. చింతపండు ఫేస్ వాష్ చర్మ సౌందర్యం కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
చింతపండు ఫేస్ వాష్ తయారీ విధానం:
ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల చింతపండు గుజ్జు (Tamarind pulp), ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ (Rose water), ఒక టేబుల్ స్పూన్ పెరుగు (Curd), సగం టేబుల్ స్పూన్ విటమిన్ ఇ పౌడర్ (Vitamin E powder), ఒక టేబుల్ స్పూన్ జోజోబా ఆయిల్ (Jojoba Oil), ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) వేసి బాగా కలుపుకోవాలి.